వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర తెలిపిన కథానాయకుడు.
ఇప్పుడు కథానాయకుడిగా, మరియు కొద్ది రోజుల్లో మహానాయకుడు గా మనం ఎన్టీఆర్ జీవిత కథని చూస్తున్నాము, అయితే సినిమా పట్ల ఎన్టీఆర్ కి ఎంత అంకితభావం వున్నది అనడానికి ఒక ఉదాహరణ శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమా.
ఇప్పుడు కథానాయకుడిగా, మరియు కొద్ది రోజుల్లో మహానాయకుడు గా మనం ఎన్టీఆర్ జీవిత కథని చూస్తున్నాము, అయితే సినిమా పట్ల ఎన్టీఆర్ కి ఎంత అంకితభావం వున్నది అనడానికి ఒక ఉదాహరణ శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమా. ఆంధ్ర దేశంలో వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర ప్రాచుర్యంలో ఉంది. కాలజ్ఞానిగా ప్రసిద్ధుడైన ఈ యోగిపురుషుని జీవి కథను నందమూరి తారకరామారావు ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించాడు. తానే స్వయంగా నటించాడు మరియు దర్శకత్వం వహించాడు. ఎన్టీయార్ రాజకీయాలలోకి వచ్చిన కొద్దికాలానికే ఈ సినిమా భారీ అంచనాలతోను, కొన్ని వివాదాలతోను, రాజకీయ దుమారంతోను విడుదలైంది. 1980లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమై, 1981లో పూర్తయింది. అయితే విడుదల అంత సులభం కాలేదు. సినిమాలోని కొన్ని అంశాలపై సెన్సార్ అభ్యంతరం చెప్పడంతో మూడేళ్లు న్యాయపోరాటం చేసి విజయం సాధించారు ఎన్టీఆర్. ఈ చిత్రం 1984 నవంబర్ 29న విడుదలై ఘనవిజయం సాధించింది.శ్రీ.కో.