మామా చందమామా వినరా నా కథ అనే పాట మీరు విన్నారా... ఈ పాట సంబరాల రాంబాబు సినిమా లోనిది, ఈ పాటలో మగ గొంతుతో ఉన్న పాటను బాలసుబ్రమణ్యం, ఆడ గొంతుతో ఇదే పాటను పి.సుశీల పాడారు. అలాగే మరో మంచి పాట "జీవితమంటే అంతులేని ఒక పోరాటం" అని పాట కూడా. అయితే ఈ సంబరాల రాంబాబు సినిమాకి జి. వి. ఆర్. శేషగిరి రావు దర్శకత్వం వహించినారు, ఇది 1970 లొ వచ్చిన తెలుగు కామెడి-డ్రామా చలన చిత్రం, ఈ సినిమాని టి. మోహన్ రావు నిర్మించారు. ఇది కె. బాలచందర్ యొక్క 1968 తమిళ చిత్రం ఎతిర్ నెచల్ యొక్క పునర్నిర్మాణం, అదే పేరుతో తన రంగస్థల నాటకం ఆధారంగా రూపొందించబడింది. ఈ సినిమాలో చలం, శారద మరియు ఎస్. వి. రంగ రావు నటించారు. మీకు పాత సినిమాలు ఇష్టం వుంటే తప్పక ఈ సినిమా చూడండి. శ్రీ.కో.