కొన్ని సినిమాలు చిత్రీకరణ సమయంలో చాల ఇబ్బందులను ఎదుర్కొంటాయి, కాని విడుదల అయిన తర్వాత విజ్రుమ్భిస్తూ ఇన్నో విజయాలను అందుకుంటాయి, అలాంటి ఒక సినిమానే అలనాటి లవకుశ సినిమా. ఇది సి.పుల్లయ్య, ఆయన కుమారుడు సి.ఎస్.రావు దర్శకులుగా, లలితా శివజ్యోతి పిక్చర్స్ పతాకంపై శంకరరెడ్డి నిర్మించగా, ఎన్.టి.రామారావు, అంజలీదేవి, మాస్టర్ నాగరాజు, మాస్టర్ సుబ్రహ్మణ్యం, కాంతారావు, చిత్తూరు నాగయ్య ప్రధాన పాత్రధారులుగా 1963లో విడుదలైన తెలుగు పౌరాణికచలనచిత్రం. లవకుశ సినిమాను ఉత్తర రామాయణం ఆధారంగా తీశారు. సీతారాములు పట్టాభిషిక్తులు అయ్యాకా చాకలి తిప్పడు నిందవేశాడని రాజారాముడు గర్భవతియైన సీతాదేవిని అడవుల్లో వదలివేయడంతో ప్రారంభయ్యే ఈ కథలో లవకుశుల జననం, వారు రామాయణ గానం చేయడం, రామ అశ్వమేథయాగం, అశ్వాన్ని లవకుశులు బంధించి ఏకంగా రామునితోనే యుద్ధం చేయడం వంటి సన్నివేశాలు ఉంటాయి. 1934లో బ్లాక్ అండ్ వైట్లో లవకుశను దర్శకత్వం వహించిన సి.పుల్లయ్యకే మళ్ళీ ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం దక్కింది. 1958లో ప్రారంభమైన ఈ సినిమా పూర్తిగా కలర్లో చిత్రీకరణ జరుపుకున్న తొలి తెలుగు చిత్రంగా నిలిచింది. ఆర్థిక కారణాలతో సినిమా చిత్రీకరణ 5 సంవత్సరాల పాటు కొనసాగింది. సినిమా ప్రారంభించినప్పుడు దర్శకత్వం వహించిన సి.పుల్లయ్య అనారోగ్యం పాలుకావడంతో ఆయన కుమారుడు సి.ఎస్.రావు పున:ప్రారంభం తర్వాత దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు. మొత్తానికి సినిమా చిత్రీకరణ పూర్తిచేసుకుని 1963లో 26 కేంద్రాల్లో విడుదలైంది. సినిమా అపూర్వమైన వాణిజ్య విజయాన్ని సాధించింది. విడుదలైన అన్నికేంద్రాల్లో 150 రోజులు జరుపుకోవడంతో ప్రారంభించి 500 రోజులు ఆడిన తొలి తెలుగు చిత్రంగా చరిత్రకెక్కింది. పావలా, రూపాయి టిక్కెట్లు ఉన్న రోజుల్లో సినిమా రూ.కోటి వసూళ్ళు పొందింది. 60లక్షల జనాభా ఉన్న వంద కేంద్రాల్లో 1.98 కోట్ల టిక్కెట్లు అమ్మి చరిత్ర సృష్టించింది. సినిమా తమిళ వెర్షన్ 40 వారాలు ఆడగా, హిందీ వెర్షన్ సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. రిపీట్ రన్స్ లోనూ కేంద్రాల సంఖ్య, ఆడిన రోజుల్లో రికార్డ్ సాధించింది.శ్రీ.కో