కొద్దిమంది సినిమా దర్శకులకి తమదంటూ ఒక ప్రత్యెక భాణి వుంటుంది, అలాంటి దర్శకులే క్రాంతి కుమార్. వీరు ఒక ప్రముఖ సినీ దర్శకుడు, నిర్మాత, మరియు రచయిత కూడా. ఆయన రెండు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, నాలుగు నంది పురస్కారాలు అందుకున్నాడు. 1985లో ఆయన దర్శకత్వం వహించిన స్రవంతి అనే సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారాన్ని గెలుచుకుంది. 1991 లో ఆయన దర్శకత్వం వహించిన సీతారామయ్యగారి మనవరాలు భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడింది. 2001 లో ఆయన దర్శకత్వం వహించిన, సౌందర్య ప్రధాన పాత్ర పోషించిన 9 నెలలు అనే సినిమా టొరంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడింది. శ్రీ.కో.