మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా!
కొన్ని పాటలు సినిమా పాటలు అయిన కూడా ఆ తర్వాత అవి భక్తి గీతాలుగా, ఎన్నో పండుగలలో, గుడిలలో పాడబడతాయి, అలాంటి పాటనే మహేశా పాపవినాశా అనే ఈ పాట. ఇది కాళహస్తి మహాత్యం సినిమా కోసం తోలేటి వెంకటరెడ్డి రచించారు.
కొన్ని పాటలు సినిమా పాటలు అయిన కూడా ఆ తర్వాత అవి భక్తి గీతాలుగా, ఎన్నో పండుగలలో, గుడిలలో పాడబడతాయి, అలాంటి పాటనే మహేశా పాపవినాశా అనే ఈ పాట. ఇది కాళహస్తి మహాత్యం సినిమా కోసం తోలేటి వెంకటరెడ్డి రచించారు. దీనిని ఘంటసాల వెంకటేశ్వరరావు గానం చేయగా ఆర్. సుదర్శనం సంగీతాన్ని అందించారు. ఇప్పటికి మీరు ఎక్కడో ఈ పాట వినేవుంటారు. శ్రీ.కో.
మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా
నిన్ను నమ్మినాను రావా నీల కంధరా దేవా
భక్తియేదొ పూజలేవో తెలియనైతినే
పాపమేదొ పుణ్యమేదో కాననైతినే దేవా
మంత్రయుక్త పూజ సేయా మనసు కరుగునా
మంత్రమో తంత్రమో ఎరుగనైతినే
నాదమేదో వేదమేదో తెలియనైతినే
వాదమేల పేదబాధ తీర్చరావయా స్వామి
ఏకచిత్తమున నమ్మిన వారికి శోకము తీర్చువొ రుద్రయ్య
ప్రాకటముగ చిరువేట చూపి నా ఆకలి తీర్పగ రావయ్య
దీటుగ నమ్మితి గనవయ్య వేట చూపుమా రుద్రయ్య
వేట చూపుమా రుద్రయ్య వేట చూపుమా రుద్రయ్య