గయ్యాళి పాత్రలకి పెట్టింది పేరు!
గయ్యాళి పాత్రలకి పెట్టింది పేరుగా నిలిచిన నటిమణి మన సూర్యకాంతం. ఈవిడ ఒక ప్రముఖ సినీ నటి, ముక్యంగా తెలుగు సినిమాల్లో గయ్యాళి పాత్రల్లో తన సహజ నటనతో ప్రాచుర్యం పొందింది.
గయ్యాళి పాత్రలకి పెట్టింది పేరుగా నిలిచిన నటిమణి మన సూర్యకాంతం. ఈవిడ ఒక ప్రముఖ సినీ నటి, ముక్యంగా తెలుగు సినిమాల్లో గయ్యాళి పాత్రల్లో తన సహజ నటనతో ప్రాచుర్యం పొందింది. ప్రసిద్ధ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు ఒకసారి టెలివిజన్ ఇంటర్వ్యూలో తాను హాస్యానికి సూర్యకాంతంతో స్వయంగా ఇలా అన్నానని చెప్పాడు - "నువ్వు తెలుగు భాషకు చేసిన అన్యాయం ఒకటుంది. 'సూర్యకాంతం' అనే చక్కని పేరు ఇంకెవరూ పెట్టుకోకుండా చేశావు". అంటే ఆవిడా పాత్రల్లో అంతబాగా వోదిగిపోయేది అన్నట్టు. సూర్యకాంతాన్ని హాస్యనటీమణిగా ముద్ర వెయ్యడానికి లేదు. ఆమె ప్రత్యేకంగా హాస్యం చెయ్యకపోయినా ఆమె సంభాషణ చెప్పే తీరు, నవ్వు తెప్పిస్తుంది, చేసే చేష్టలు కోపం తెప్పిస్తాయి. అలా అని ఆమె దుష్టపాత్రధారిణి అని కూడా అనలేం. సహాయ నటి అనే అనాలి. గయ్యాళి అత్తకి మారుపేరు సూర్యకాంతం అనిపించుకుంది. ఓర చూపులు చూస్తూ, ఎడంచెయ్యి విసుర్తూ కుడిచెయ్యి నడుం మీద నిలబెట్టి ఆమె చెప్పిన సంభాషణా చాతుర్యం, అంతలోనే వెక్కిరిస్తూ, అంతలోనే కల్లకబుర్లతో బొల్లిడుపులు ఏడుస్తూ ఆమె ధరించిన అత్త పాత్రలు సజీవ శిల్పాలు. శ్రీ.కో.