Live Blog: ఈరోజు (మే-28-గురువారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
టీటీడీ బోర్డు సమావేశం ఈరోజు!
టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం ఈరోజు జరగనుంది.
తిరుమల అన్నమయ్య భవనంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం జరుగుతుంది.
టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశానికి 93 అంశాలతో భారీ అజెండా సిద్ధం అయింది
ప్రధానంగా లాక్ డౌన్ కారణంగా ఏర్పడిన ఆర్ధిక లోటును భర్తీ చేసుకోవడం, లక్దౌన్ అనంతరం భక్తుల దర్శనం కోసం తీసుకోవాల్సిన చర్యలు, నిరర్థక ఆస్తుల విక్రయం వంటి విషయాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.
- టీడీపీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు 97వ జయంతి నేడు.
- ఈ సందర్భంగా ట్యాంక్‌బండ్ దగ్గర ఎన్టీఆర్ ఘాట్‌లో ఆయన తనయుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నివాళులర్పించారు.
- బాలకృష్ణతో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా నివాళులర్పించారు.
- నందమూరి బాలయ్య, రామకృష్ణ, సుహాసినితో పాటూ పలువురు ట్యాంక్‌బండ్ సమీపంలోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.
బోరుబావిలో పడిన బాలుని మృతి!
నిన్న (బుధవారం) సాయంత్రం బోరుబావిలో పడ్డ బాలుడు సాయివర్ధన్ మృతి చెందాడు.
మెదక్ జిల్లా పాపన్న పేట మండలం పొడ్చన్‌పల్లిలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
ఈ ఉదయం (గురువారం) 5:45 గంటలకు ఎన్దీఎఫ్ బృందాలు బాలుని మృతదేహాన్ని బోరుబావి నుంచి వెలుపలికి తీశాయి.
ఆక్సిజన్ అందకపోవడంతో బాలుడు మృతి చెందినట్టు గుర్తించారు.
దాదాపు 8:30 గంటల పాటు సహాయక బృందాలు శ్రమించినా ఫలితం దక్కలేదు - మరిన్ని వివరాలు
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ
నిన్న ఒక్క రోజే ఏకంగా 107 కేసులు నమోదు.
కరోనా కారణంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
నిన్న నమోదైన కేసుల్లో 39 మంది మాత్రమే తెలంగాణలో నమోదైనవి.
కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికుల్లో 19 మంది, ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్న వారిలో 49 మంది ఉన్నారు.
తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,098కి చేరుకోగా, మృతుల సంఖ్య 63కి పెరిగింది.
అలాగే, ఇప్పటి వరకు 1,321 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 714 మంది వివిధ ప్రాంతాల్లో చికిత్స పొందుతున్నారు.