Live Blog: ఈరోజు (మే-28-గురువారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రకుట్ర భగ్నం
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రకుట్రను భద్రతాదళాలు భగ్నం చేశాయి. పుల్వామాలో సైన్యంపై ఉగ్రవాదులు దాడికి యత్నించగా.. పలు వాహనాలు దెబ్బతిన్నాయి. ఉగ్రకుట్రలో లష్కరే, జైషే మహ్మద్ ఉగ్రసంస్థల హస్తం ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ముందస్తు సమాచారంతో ఉగ్రకుట్రను సీఆర్పీఎఫ్, సైనిక బలగాలు భగ్నం చేశాయి.
కరీంనగర్ లో ఎన్టీఆర్ 97 వ జయంతి వేడుకలు
కరీంనగర్ టౌన్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను, కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన పార్లమెంటరీ అధ్యక్షులు అంబటి జోజి రెడ్డి. అనంతరం వారు మాట్లాడుతూ... ఎన్టీఆర్ బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు పనిచేశారని కొనియాడారు. నాడు పేదలకోసం రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి, ఎంతోమంది పేదల కడుపులు నింపారని అన్నారు. ఆయన పెట్టిన మహానాడు ఇప్పటికి కూడా నడుస్తుందని, 38వ మహానాడు కార్యక్రమాన్ని కరీంనగర్ లో నిర్వహిస్తున్నామని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీకి గట్టిపోటీని ఇచ్చి, ప్రజలకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమేనని ఆయన అన్నారు. ఎక్కడ అన్యాయం జరిగినా న్యాయం జరిగే వరకూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిలదీసి న్యాయం జరిగే వరకూ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
గుప్తనిధుల కోసం తవ్వకాలు!
* చిత్తూరు జిల్లా కుప్పం మండలం గుడ్ల నాయన పల్లి లో గుప్తనిధుల కోసం తవ్వకాలు....
* గత నెల రోజుల నుంచే తన సొంత ఇంట్లోనే
* గుప్తనిధుల కోసం తవ్వకాలు నిర్వహించినట్లు అనుమానం...
* సమాచారం తెలుసుకుని ఇంటికి తాళం వేసిన అధికారులు....
* ఈ అంశంపై పలురకాలుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి...
* కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు...
* రంగంలోకి దిగిన అధికారులు పోలీసు యంత్రాంగం...
- కడప జిల్లా బద్వేలు గోపవరం మండలం పి.పి.కుంట చెక్ పోస్టు వద్ద తనిఖీలు.
- మినీ లారీలో తరలిస్తున్న 15 లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్ లు స్వాధీనం.
- కర్ణాటక నుంచి విశాఖ తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు.
- ఇద్దరు అరెస్టు. వ్యాన్ సీజ్. గుట్కా ప్యాకెట్లు స్వాధీనం.
ఎల్ బీ నగర్ లో రెండు ప్రాజెక్టులు ఈరోజు ప్రారంభం
- హైదరాబాద్ లోని ఎల్‌బీనగర్ జోన్‌లో రెండు ప్రాజెక్టులు ఈరోజు ప్రారంభించనున్నారు.
- మునిసిపల్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ వీటిని ప్రారంభిస్తారు.
- ఈ ప్రారంభోత్సవ అంశాన్ని కేటీఆర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
- కామినేని కుడివైపు ఫ్లై ఓవర్, ఎల్‌బీనగర్ జంక్షన్ ఎడమవైపు అండర్‌పాస్‌లను ప్రారంభించనున్నారు.
కామినేని ఫ్లై ఓవర్:
పొడవు: 940 మీటర్లు
వెడల్పు: 12 మీటర్లు
వ్యయం: రూ. 43 కోట్లు
ఎల్‌బీనగర్ అండర్‌పాస్:
పొడవు: 519 మీటర్లు
క్యారేజ్‌వే: 10.5 మీటర్లు
వ్యయం: రూ.14 కోట్లు
While we continue to develop irrigation infra for farmers, Telangana Govt also has been focused on improving urban infrastructure 👇
— KTR (@KTRTRS) May 27, 2020
Will be inaugurating two latest outcomes of #SRDP at LB Nagar tomorrow
Kamineni junction RHS 940m flyover & LB Nagar junction LHS 519m VUP pic.twitter.com/e8Q9lvQyJb
చినజీయర్ స్వామిని కలిసిన సీఎం కేసీఆర్
కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభోత్సవానికి త్రిదండి చినజీయర్ స్వామీజీని ఆహ్వానించిన ముఖ్యమంత్రి కేసీఆర్.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్ జీయర్ ఆశ్రమానికి వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్.
స్వామీజీ ఆశీస్సులు తీసుకున్న ముఖ్యమంత్రి.
ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట మంత్రులు శ్రీనివాస్ గౌడ్ , నిరంజన్ రెడ్డి.
ఆశ్రమంలో గంటపాటు చినజీయర్ స్వామీజీతో సీఎం కేసీఆర్ చర్చలు.
కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభోత్సవంతో పాటు యాగానికి రావాల్సిందిగా చినజీయర్ స్వామీజీని ఆహ్వానించిన కేసీఆర్
రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వాలు విఫలం
విశాఖపట్నం: రైతు, కౌలు రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గండినాయనబాబు ఆరోపించారు. జగదాంబకూడలిలోని సీఐటీయూ కార్యాలయ ఆవరణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వ్యవసాయ రంగానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలన్నారు. పంట రుణాల రికవరీని తక్షణమే ఆపాలన్నారు. ఖరీఫ్‌లో పెట్టుబడులు కోసం కొత్తగా పంట రుణాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుబ్బారావు, శ్రీను, రాజు పాల్గొన్నారు.
తూర్పు గోదావరిజిల్లా ప్రత్తిపాడు శంఖవరం మండలం సిదివారిపాలెం లో రాత్రి నిద్రలో వున్నయువకుడిని నరికి చంపిన్ ఘటన చోటుచేసుకుంది.
మృతుడు తురం తలుపులు (20)గా గుర్తింపు .
సంఘటనస్థలానికి చేరుకొన్న పోలీసులు.
29 నుంచి ఐదో విడత రేషన్ పంపిణీ
విశాఖపట్నం: ఐదో విడత ఉచిత రేషను పంపిణీ ఈ నెల 29 నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రారంభం కానుంది. 2133 రేషను డిపోలు, మరో 450 కౌంటర్ల ద్వారా 12.10 లక్షల కుటుంబాలకు సరకులు అందజేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. జూన్ 10 వరకు ఈ పంపిణీ కొనసాగనుంది. ఈసారి బియ్యంతో పాటు కిలో కందిపప్పు ఉచితంగా ఇవ్వనున్నారు.
తూర్పుగోదావరిలో రోడ్డు ప్రమాదం : వ్యక్తీ మృతి
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం...
ఎటపాక మండలం గుండాల వద్ద టాటా మ్యాజిక్ అదుపు తప్పి పల్టీ కొట్టడంతో నెలిపాక గ్రామానికి చెందిన మ్యాజిక్ డ్రైవర్ కాడారి.నాగేద్ర మృతి