Live Updates:ఈరోజు (జూన్-02) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-06-02 00:52 GMT
Live Updates - Page 3
2020-06-02 05:03 GMT

రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ శుభాకాంక్షలు

-గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

-ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టడంతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించిన ఘనత రాష్ట్రానికి దక్కిందని కొనియాడారు.

-‘నా రాష్ట్రం-నాకు గర్వకారణం’ అనే రీతిలో తెలంగాణను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని గవర్నర్ ఆకాంక్షించారు.

-ప్రభుత్వాల విజయం ప్రజలెంత సుఖసంతోషాలతో ఉన్నారనే అంశాన్ని బట్టి ఆధారపడుతుంది గవర్నర్ అన్నారు.

-రాష్ట్రం అతి త్వరలో బంగారు తెలంగాణ సాక్షాత్కరిస్తుందన్న ఆశాభావం వ్యక్తంచేశారు. 

2020-06-02 04:41 GMT

తిరుపతిలో విద్యార్ధి ఆత్మహత్య.

👉తిరుపతి నగర పరిధిలోనున్న అన్నారావు సర్కిల్ సమీపంలోని లక్ష్మి అపార్ట్మెంట్ లో ఘటన.

👉 లక్ష్మీ అపార్ట్మెంట్ లో నివసిస్తున్న వెంకటరెడ్డి కుమారుడు చరణ్ శశిధర్ రెడ్డి(21)గా అలిపిరి పోలీసులు గుర్తింపు.

👉 మనస్పర్ధకు లోనై ఇంటిలోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడి.

👉 మృతదేహాన్ని రూయా ఆస్పత్రికి తరలింపు.

👉 కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న అలిపిరి ఎస్ ఐ వినోద్ కుమార్.

2020-06-02 04:39 GMT

తిరుపతి దాసరిమఠం లో మహిళా టీచర్ అనుమానాస్పద మృతి.

వివాహేతర సంబంధాలే కారణమంటున్న స్థానికులు.

మృతదేహాన్ని సొంత ఊరికి తరలిస్తున్న బంధుమిత్రులు.

2020-06-02 04:38 GMT

ఒక్క రోజులో దేశంలో 8,171 మందికి కరోనా

➡️గత 24 గంటల్లో 204 మంది మృతి

➡️కరోనా కేసుల సంఖ్య మొత్తం 1,98,706

➡️మృతుల సంఖ్య 5,598

➡️97,581 మందికి ఆసుపత్రుల్లో చికిత్స  

2020-06-02 04:38 GMT

కడప జిల్లా ఓబులవారిపల్లె మండలం

వై కోట గ్రామం లో నాకాబందీ నిర్వహించిన పోలీసులు

నాటు సారా తయారు చేసే 11 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

వై కోట గ్రామంలో గ్రామసభ నిర్వహించి నాటు సారా తయారు చేయడం అమ్మడం నేరమని తయారు చేస్తున్న వారి పై కేసులు నమోదు చేస్తామని ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే ఉపేక్షించేది లేదని అవసరమైతే పీడీ యాక్ట్ లు కూడా పెడతామని హెచ్చరించిన డి.ఎస్.పి నారాయణ స్వామి రెడ్డి.

2020-06-02 04:37 GMT

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు

-తెలంగాణ ప్రజలకు రాష్ట్రావతరణ దిన శుభాకాంక్షలు.

-ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నో క్షేత్రాలో తమ ప్రతిభను చాటుతున్నారు.

-దేశ ప్రగతిలో ఈ రాష్ట్రం ఓ ముఖ్య భూమిక పోషిస్తోంది.

-తెలంగాణ ప్రజల అభ్యున్నతి మరియు శ్రేయస్సుకై నేను ప్రార్ధిస్తున్నాను. 


2020-06-02 04:36 GMT

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు

-తెలంగాణ ప్రజలకు రాష్ట్రావతరణ దిన శుభాకాంక్షలు.

-ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నో క్షేత్రాలో తమ ప్రతిభను చాటుతున్నారు.

-దేశ ప్రగతిలో ఈ రాష్ట్రం ఓ ముఖ్య భూమిక పోషిస్తోంది.

-తెలంగాణ ప్రజల అభ్యున్నతి మరియు శ్రేయస్సుకై నేను ప్రార్ధిస్తున్నాను. 

2020-06-02 04:34 GMT

తెలంగాణ ప్రజలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శుభాకాంక్షలు

-తెలంగాణ ప్రజలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ట్విటర్‌ వేదికగా రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

-తెలంగాణ రాష్ట్ర సోదర సోదరీమణులకు నమస్కారం.

-తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.

-కష్టపడి పనిచేసే తెలంగాణ ప్రజలు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.

-యావత్‌ దేశం గర్వించే సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యం తెలుగువారి సొంతమని వెల్లడించారు.

-తెలంగాణ రాష్ట్రం సుసంపన్న భవిష్యత్‌ దిశగా, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

2020-06-02 04:23 GMT

నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం..

-అసెంబ్లీలో ప్రారంభమైన వేడుకలు

-తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఏర్పడి నేటికి ఆరు ఏండ్లు పూర్తి చేసుకుని ఏడో వసంతంలోకి అడుగుపెట్టింది.

- గన్‌పార్క్‌లో అమరులకు కేసీఆర్ నివాళి

-అసెంబ్లీలో జాతీయ జెండాలు ఎగురవేసిన పోచారం, గుత్తా

2020-06-02 04:14 GMT

అమరవీరుల స్థూపానికి సీఎం కేసీఆర్ నివాళులు

-గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు.

-ప్రగతి భవన్‌ నుంచి నేరుగా గన్‌పార్క్‌ దగ్గరకు చేరుకున్న ఆయన అమర వీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. 

-ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి అమరులైన వారి త్యాగాలను సీఎం గుర్తు చేసుకున్నారు.

-అనంతరం ప్రగతి భవన్లో సీఎం జెండా ఎగరేస్తారు. తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నేత కే కేశవరావు జాతీయ జెండా ఎగురవేశారు.

Tags:    

Similar News