అమరావతి
రాజధాని గ్రామాల్లో రైతుల వినూత్న నిరసన.
భూములు ఇచ్చిన తమను ఆదుకోవాలని న్యాయమూర్తిని నమస్కారం పెడుతూ వేడుకుంటున్న రైతులు.
హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి వెళ్లే మార్గంలో భారీగా సీడ్ యాక్సెస్ రోడ్డుపై నిలువు కాళ్లపై నిల్చున్న రైతులు.
తాళ్లాయపాలెం సీడ్ యాక్సెస్ రోడ్డు నుండి హై కోర్టు వరకు భారీగా తరలి వచ్చిన రైతులు.
నేడు గెజిట్ రద్దు పై హైకోర్టులో విచారణ జరపనున్న ప్రధాన న్యాయమూర్తి.
భూములు ఇచ్చిన తమను గత ప్రభుత్వం,ఇప్పటి ప్రభుత్వం రెండు కలిసి మోసం చేశాయని ప్లకార్డులు ప్రదర్శన.
ఇదే మార్గం గుండా మరి కొద్ది సేపట్లో హై కోర్టుకు రానున్న ప్రధాన న్యాయమూర్తి జెకె మహేశ్వరి,ఇతర న్యాయమూర్తులు.
వంగపండు మృతి పట్ల చంద్రబాబు సంతాపం
అమరావతి: వంగపండు మృతి పట్ల చంద్రబాబు సంతాపం. ప్రముఖ కవి, గాయకుడు వంగపండు ప్రసాద రావు మృతిపట్ల మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. తన సాహిత్యం ద్వారా తెలుగు ప్రజలను జాగృతం చేశారు. తన గొంతుతో, తన పదాలతో అశేష ప్రజానీకాన్ని ఉర్రూతలూగించారు. ప్రజా చైతన్యానికి ఎనలేని కృషి చేశారు. వంగపండు సాహిత్యం అనేక భాషల్లోకి అనువదించడం తెలుగు జాతికే గర్వకారణం. పీడిత తాడిత ప్రజల హక్కుల సాధన కోసం తన గొంతును, తన సాహిత్యాన్ని అంకితం చేసిన చరితార్ధుడు వంగపండుగా కొనియాడారు. ఆయన మృతి తెలుగు జానపద సాహిత్య లోకానికి తీరని లోటు. వంగపండు అభిమానులకు, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని చంద్రబాబు తెలియజేశారు.
అమరావతి:
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
ప్రముఖ ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు గారి మృతితో ఉత్తరాంధ్ర గొంతు మూగబోయింది.
కళ ప్రజల కోసం అంటూ చివరి శ్వాస వరకూ గొంతెత్తి వందల జానపదాలకు గజ్జెకట్టారు.
వంగపండు ప్రసాదరావు గారి మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటు.
ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన తెలంగాణ శాసనసభ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి. నిజాయితీ, నిబద్ధత కలిగి ప్రజా సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేసిన నాయకుడు సున్నం రాజయ్య అని తెలిపారు. సున్నం రాజయ్య కుటుంబ సభ్యులకు తన ప్రగాడ సానుభూతి తెలిపారు.
నారాయణ సిపిఐ జాతీయ కార్యదర్శి
వంగపండుప్రసాద్ ఉత్తరాంధ్ర " సాంస్కృతి "ప్రత్యేకతను వారికవితలోను , కళానాట్యం లోను ప్రదర్శించిన ప్రగతిశీల కళాకారుడు .
భూబాగొతం నాటిక ప్రదర్శనలో ప్రజానాట్యమండలితోను వందలప్రదర్శనలిచ్హారు .
నల్లూరియడల వందేమాతరం యడల అమితగౌరబావం చూపేవారు .
కళామతల్లికి యనలేని సేవలు చేశిన వంగపండు బందవిముక్తుడయ్యారు .
వారి మరణం సాంస్కృతిక ఉద్యమానికి తీరని లోటు .
వంగపండు మరణం పట్ల ప్రఘాడ సంతాపం తెలియజేస్తున్నాను .
విశాఖపట్నం :
ప్రముఖ వాగ్గేయ కారుడు వంగపండు ప్రసాదరావు మృతి కి పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సంతాపం తెలిపారు.
ఉత్తరాంధ్ర జానపద శిఖిరం, తన పాటలు, రచనలు , ప్రదర్శనలతో ప్రజల్లో చైతన్యం నింపిన వ్యక్తి వంగపండు.
ఉత్తరాంధ్ర జానపదాన్ని ప్రపంచ స్థాయికి తీసుకొని వెళ్లిన కళాకారుడు.
వంగపండు మరణం యావత్ ఉత్తరాంధ్ర ప్రజలకు తీరని లోటు.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.
విజయనగరం పార్వతీపురం:
ప్రముఖ ప్రజాకవి వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు మృతి
తండ్రి మృతదేహాం వద్దకు చేరుకున్న రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలు వంగపండు ఉష
మరికాసేపట్లో పార్వతీపురం లో ఉన్న స్వగృహం నుంచి వంగపండు అంతిమయాత్ర ప్రారంభం
నూతన జిల్లాల ఏర్పాటు లో భాగంగా పార్వతిపురం జిల్లాగా ప్రకటిస్తే వంగపండు పేరును జిల్లా పేరుగా ప్రకటించాలని కోరుతూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన వంగపండు అభిమానులు
పార్వతీపురం జిల్లాగా ప్రకటిస్తే తన తండ్రి పేరును జిల్లా పేరుగా నిర్ణయించాలనే ఉద్దేశాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు ఉష
రాజమండ్రి- సీతానగరం రోడ్డు విస్తరణాభివృద్ధికి రూ.70 కోట్ల నిధులు మంజూరు -
తూర్పుగోదావరి రాజమండ్రి
ఈ నెలలోనే పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నాం
కాతేరు గామన్ వంతెన నుంచి సీతానగరం బస్‌స్టాండ్ కూడలి వరకు నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరణ చేస్తాం
ప్రస్తుతం సీతానగరం రోడ్డు 5.5 మీటర్లు మాత్రమే ఉంది
విస్తరణలో భాగంగా 20 మీటర్లకు వెడల్పు పెరుగుతుంది
సీతానగరం బస్టాండ్, రఘుదేవపురం వద్ద ఆక్రమణలను పూర్తిగా తొలగించేలా చర్యలు
రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా
శ్రీశైలం జలాశయంలో తగ్గిన వరద ప్రవాహం
ఇన్ ఫ్లో : 14,468 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 38,140 క్యూసెక్కులు
పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు
ప్రస్తుతం : 850.90 అడుగులు
నీటి నిలువ సామర్థ్యం : 215 టిఎంసీలు
ప్రస్తుతం : 82.0108. టిఎంసీలు
ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
తూర్పుగోదావరి
- రాజమండ్రి లోని జిల్లా స్థాయి బొమ్మూరు కొవిడ్ కేర్ సెంటర్‌లో అధ్వాన్నంగా పారిశుద్ధ్య నిర్వహణ
- రోగులున్న టిడ్కో భవనాల చుట్టూ పేరుకుపోయిన ఖాళీ సీసాలు, తినిపారేసిన పేపరుప్లేట్లు, ఇతర వ్యర్థాలు
- కొవిడ్ కేర్ సెంటర్లో పారిశుద్ధ్య సమస్యలను మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఏమీ మారడం లేదు