Live Updates:ఈరోజు (ఆగస్టు-04)ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-08-04 00:56 GMT
Live Updates - Page 3
2020-08-04 08:26 GMT

గుంటూరు:


నకరికల్లు మండలం శివాపురం తండా వడ్డీ డబ్బులు ఇవ్వలేదని మహిళను ట్రాక్టర్ తో ఢీ కొట్టి హత్య చేసిన వ్యక్తి ని అరెస్ట్ చేసిన రూరల్ పోలీసులు.


రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ...


మంత్రి భాయి అనే మహిళను శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ట్రాక్టర్ ఎక్కించి హత్య చేసినట్టు సమాచారం రావడంతో విచారణ చేపట్టాం....


మూడు లక్షల ఎనభై వేల రూపాయలు మంత్రి భాయి శ్రీనివాస్ రెడ్డి వద్ద అపు తీసుకుంది.


ఆ నగదు అడిగితే పొలం అమ్మేసి ఇస్తామని చెప్పారు...


అప్పు విషయం సెటిల్ చేసుకునేందుకు మాట్లాడుకునే సమయంలో ఇద్ధరి మధ్య వాగ్వివాదం జరిగింది.


ఆ సమయంలో శ్రీనివాస్ రెడ్డి ట్రాక్టర్ తో మంత్రిభాయి పై ఎక్కించాడు.


మంత్రి భాయి అక్కడికక్కడే మృతి చెందింది...


సమాచారం అందిన వెంటనే కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నాం.


పేదలకు అన్యాయం చేస్తే సహించేది లేదు...


హత్యను రాజకీయాలకు ఆపాదించాలని చూస్తున్నారు.


అది మంచి విధానం కాదు.


నిందితుడి పై హత్య,ఎస్సీ,ఎస్టీ కేసు నమోదు చేశాం...


కేసు ఫాస్ట్రాక్ కోర్టులో పెట్టి నిందితుడికి త్వరితగతిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటాం....


2020-08-04 08:25 GMT

అమరావతి

ట్విట్టర్ లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్...

ఎన్నికల ముందు జై అమరావతి అని నినదించారు.

అందుకే మా అన్న రాజధానిలో సొంతిళ్ళు నిర్మించుకున్నారు అని, అన్ని ప్రాంతాల వైకాపా నాయకులూ బల్ల గుద్ది మరీ చెప్పారు.

ఇప్పుడు జే టర్న్ ఎందుకు తీసుకున్నారు జగన్ రెడ్డి గారు ? మూడు ముక్కలాటలో స్వార్థం లేకపోతే ప్రజాభిప్రాయానికి ఎందుకు జంకుతున్నట్టు?

2020-08-04 07:08 GMT

అమరావతి: ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

పరిశ్రమల లో వరుస ప్రమాదాల నేపధ్యంలో వివిధ పరిశ్రమలపై ప్రత్యేక డ్రైవ్ కు ప్రభుత్వం ఆదేశాలు

జిల్లా స్థాయిలో పరిశ్రమల తనిఖీ కోసం కమిటీలు ఏర్పాటు

జాయింట్ కలెక్టర్ చైర్మన్ గా మరో ఆరుగురు సభ్యులతో కమిటీ

ఎలాంటి జాగ్రత్తలు అయినా 30 రోజుల లోపే తీసుకునేలా చూడాలని కమిటీ కి ఆదేశం

వివిధ విషవాయువులు కలిగిన పరిశ్రమలు, ప్రమాదకర కెమికల్స్, పేలుడు పదార్ధాలు, రెడ్ కేటగిరీ పరిశ్రమలు ఇలా అన్నిటినీ తనిఖీ చేయాలని ఆదేశాలు

ప్రతి పరిశ్రమను పరిశీలించడమే ప్రధాన ఉద్దేశం అని ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రభుత్వం


2020-08-04 07:08 GMT

జాతీయం: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసును సీబీఐ కి అప్పగించాలని బీహార్ ప్రభుత్వ నిర్ణయం. పోలీస్ విచారణకు మహారాష్ట్ర ప్రభుత్వం, ముంబాయి పోలీసులు సహాయనిరాకరణ కారణంగా సీబీఐ కి అప్పగించాలని నిర్ణయించిన నితీష్ కుమార్


2020-08-04 07:07 GMT

విజయనగరం: వంగపండు మృతి పై మంత్రి బొత్స దిగ్భ్రాంతి

సమకాలీన ప్రపంచంలో జానపదానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన కళాకారుడు వంగపండు ప్రసాదరావు మృతి కళారంగానికి తీరని లోటు.. పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.

వంగపండు మృతిపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించిన మంత్రి బొత్స సత్యనారాయణ

దశాబ్దాల తరబడి కళా సేవ చేస్తూ, జాన పదాలతో ప్రజల గొంతుకను వినిపించిన వంగపండు

ప్రజల మదిలో చిరకాలం నిలిచి ఉంటారని ఆయన సేవలను కొనియాడుతూ. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భవగవంతుడుని ప్రార్ధన.. మంత్రి బొత్స సత్యనారాయణ.

2020-08-04 07:06 GMT

గుంటూరు:

మంగళగిరి రూరల్,తాడేపల్లి పోలీసు స్టేషన్ లలో వేరు వేరుగా మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్డి పై రాజధాని జేఏసీ ఫిర్యాదు

ఓటర్లను రైతులను, మోసం చేసి ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత ఇచ్చిన మాటకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు అని...

ఓటర్లు మోసం చేసినందుకు కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి లిఖితపూర్వక ఫిర్యాదు ...

కేసు నమోదు చేయాలని కోరిన జేఏసీ నేతలు..

2020-08-04 07:06 GMT

విశాఖ:


అచ్యుతాపురం ఫార్మా కంపెనీ లో మరోసారి పేలుడు...


విజయశ్రీ ఫార్మా కంపెనే లో పేలుడు..పేలుడు థాటికి ఎగిసిపడిన మంటలు..


భయంతో పరుగులు తిసిన కార్మికులు..


పేలుడు థాటికి లెండు ద్విచక్ర వాహనాలు ధ్వంసం..


సమీపంలో అగ్నిమాపక కేంద్రం వుండటంతో తప్పిన పెను ప్రమాదం..


మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది


2020-08-04 07:05 GMT

విజయవాడ:

గొల్లపూడి నల్లకుంటలో చిన్నారి అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో విజయవాడ స్పెషల్ పొక్సో కోర్టు సంచలన తీర్పు

నిందితుడు పెంటయ్యకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించిన న్యాయస్థానం

న్యాయస్థానం తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తున్న పలువురు స్థానికులు

2019 నవంబరు లో జరిగిన ఘటన.

2020-08-04 05:39 GMT

అమరావతి: కళా వెంకట్రావు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు

ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు మృతి కలిచివేసింది. ఉత్తరాంధ్ర జానపదాలకు గజ్జెకట్టి పల్లెకారులతో పాటు గిరిజనులనూ చైతన్యపరిచిన ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు మృతి దిగ్బ్రంతికి గురి చేసింది. ఏం పిల్లడో ఎల్దమొస్తవ పాటతో ప్రఖ్యాతి చెందారు. వందలాది జానపదపాటలను రచించి విప్లవకవిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పేరొందారు. అర్థరాత్రి స్వతంత్య్రంతో సినిమాతో ఆయన సినీ ప్రస్థానం మొదలు పెట్టారు. 1972లో జననాట్య మండలిని స్థాపించారు. 2017లో కళారత్న పురస్కారం అందుకున్న ఆయన అకాల మరణం చెందటం కలిచివేసింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.


2020-08-04 05:38 GMT

అమరావతి:

కోవిడ్ తో మృతి చెందిన వారి దహన సంస్కారాలకు 15000 రూపాయలు మంజూరు

నిధులు మంజూరు చేసేందుకు జిల్లా కలెక్టర్లకు అనుమతులు జారీ

ప్లాస్మా డోనార్ లకు పౌష్టికాహారం అవసరాల నిమిత్తం 5000 రూపాయలు చెల్లించనున్న ప్రభుత్వం

ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి

Tags:    

Similar News