Live Updates: ఈరోజు (30 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 30 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-10-30 00:59 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు శుక్రవారం | 30 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | చతుర్దశి సా.4-54 తదుపరి పూర్ణిమ | రేవతి నక్షత్రం మ.3-15 తదుపరి అశ్విని | వర్జ్యం లేదు | అమృత ఘడియలు మ.12-36 నుంచి 2-22 వరకు | దుర్ముహూర్తం ఉ.8-18 నుంచి 9-03 వరకు తిరిగి మ.12-06 నుంచి 12-52 వరకు | రాహుకాలం ఉ.10-30 నుంచి 12-00 వరకు | సూర్యోదయం: ఉ.05-59 | సూర్యాస్తమయం: సా.05-31

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-10-30 12:54 GMT

అమరావతి..

 బోండా ఉమా

(టీడీపీ పోలిట్ బ్యూరో మెంబర్)

- పేదల ఇళ్ళ స్థలాల విషయంలో టీడీపీ ఏ కోర్టు లో కేసు వేసిందో చెప్పాలి

- స్పీకర్ స్థానంలో వున్న తమ్మినేని అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు

- పేదల ఇళ్ళ స్థలాల పేరుతో 4000 కోట్లు వైసీపీ నాయకులు కొట్టేశారు

- అతి పెద్ద అవినీతి పేదల ఇళ్ళ స్థలాలులో జరిగింది వాస్తవం కాదా?

- ఇళ్ళస్థలాల అవినీతిపై వైసీపీ ఎందుకు దర్యాప్తు జరిపించడం లేదు

2020-10-30 12:49 GMT

పశ్చిమ గోదావరి..

- పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమీపంలో ఘటన

- యువతిని వేధించిన ఆకతాయిలను ఎస్సై మందలించడంతో ఎదురుదాడి

- యువతి, ఏఆర్ ఎస్సై త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు.

- దాడికి పాల్పడ్డవారు స్థానిక రాజకీయ పార్టీ నేత అనుచరులు కావడంతో

- ఎంతటివారైనా శిక్షించాలని త్రి టౌన్ పీఎస్ కు భారీగా చేరుకున్న ఏఆర్ సిబ్బంది

- పోలీసుల అదుపులో ఇద్దరు యువకులు, త్రి టౌన్ వద్ద ఉద్రిక్తత

2020-10-30 12:43 GMT

తూర్పుగోదావరి -రాజమండ్రి:

- జనసేన పార్టీకి బి.జె.పి కేంద్ర నాయకత్వంతో ఉన్న అనుబంధంతో పోలవరంకు నిధుల ప్రతిష్టంభనపై ఒప్పించే ప్రయత్నం చేస్తాం

- త్వరలో మంగళగిరి జనసేన రాష్ట్ర పార్టీ కార్యాలయంలో పోలవరం అంశంపై సమావేశం

- నాడు టి.డి,పి, నేడు వై.సి.పి ప్రభుత్వాలు రెండూ పోలవరం ఖర్చుపై కేంద్రానికి యుటిలైజేషన్ సర్టిఫికేట్లు ఇవ్వకపోవడం వల్లే సమస్య వస్తోంది

- మంత్రి బొత్స చెప్పినట్లు పోలవరం ఖర్చుని రాష్ట్ర ప్రభుత్వం భరించినా మంచిదే

- నవరత్నాలకు ఇచ్చిన ప్రాధాన్యం పోలవరం ప్రాజెక్టుకు కూడా ఇవ్వాలి

------- కందులదుర్గేష్, జనసేన ముఖ్య అధికార ప్రతినిధి

2020-10-30 12:37 GMT

తూర్పుగోదావరి:

- ప్రేమ పేరుతో తల్లిని చేసి పెళ్లి కి ముఖం చాటేసిన పెట్రోలు బంకు ఓనర్ కర్రి కిరణ్ పాల్ రెడ్డి.

- 2018 లో ఫేస్ బుక్ లో పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు కు చెందిన బలే శ్రీదేవి అనే యువతిని పరిచయం చేసుకున్న కిరణ్ పాల్ రెడ్డి.

- ప్రేమ పేరుతో శ్రీదేవిని గర్భవతిని చేసిన కిరణ్ పాల్ రెడ్డి.

- పెళ్ళి చేసుకుంటానని చెప్పి ముఖం చాటేసిన కిరణ్ పాల్ రెడ్డి.

- తనకు జరిగిన అన్యాయం పై పాలకోడేరు పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు.

- పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శ్రీదేవి ని బెదిరింపులకు గురి చేసిన కిరణ్ పాల్ రెడ్డి.

- తన బిడ్డ తో కలిసి పెట్రోలు బంకు వద్ద ఆందోళన కు దిగిన బాధితురాలు.

2020-10-30 12:33 GMT

నెల్లూరు..

ఏపి జలవనరుల శాఖామంత్రి మంత్రి డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ ,కామెంట్స్

-పప్పు మహరాజ్ ..జాగ్రత్తగా మాట్లాడు... అంటూ లోకేష్ పై ఫైర్.

-నోరు వుందని వాగితే.. రోడ్డు మీద నిలబెడతాం

-రైతుల కోసం కష్టపడుతన్నా దేశంలోనే గొప్ప నేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి

-రైతులను హింసించిన చరిత్ర మీ బాబుది

-నిన్ను నీ పార్టీ వారే నమ్మడం లేదు లోకేష్

-నువ్వు ఒకడివే అమెరికలో చదివినట్టు బిల్డప్ ...అయినా సత్యం కంప్యూటర్స్ వాళ్ళు నిన్ను చదివించినంత కాకపోయినా ..మేము కూడా చదువుకున్నాం

-పొలవరం మేము పూర్తి చేస్తామని తెలుసుకునే ముందే నువ్వు మీసాల తీసేసావు.

-పోలవరానికి రూ 50 వేల కోట్ల లో రూ.18 వేల కోట్లే ఖర్చు అయింది...

-టిడిపి వల్లనే పోలవరానికి ఈ సమస్య వచ్చింది.. పోలవరంపై ఆ రోజు కేబినెట్ లో పెట్టిన నోట్ తెచ్చి చదవండి మీ బాగోతం తెలుస్తుంది.

-లాలూచీ పడే నైజం మీది...దమ్ము ధైర్యం తో పని చేసేది జగన్

-జగన్ ముఖ్యమంత్రి అయ్యాకే ...రాష్ట్ర శుభిక్షము గా ఉంది...

-జగన్మోహన్ రెడ్డి దయ వల్ల మంత్రి ని అయ్యా....ఆయన చేసుకున్న పుణ్యం వల్ల వర్షాలు రాష్ట్రంలో పడుతున్నాయి..రైతులు సంతోషం గా వున్నారు..

-మంగళ గిరి లో నీ గోచి ఊడగొట్టారు తెలియదా..లోకేష్

-మీ నాన్న ఘనకార్యం వల్లే పోలవరానికి ఈ గతి ...

-2021 డిసెంబర్ నాటికి పొలవరం పూర్తి చేస్తాం అన్న మాటకు మేము కట్టుబడి ఉన్నాం..

2020-10-30 12:25 GMT

నంద్యాల...

* ఆల్లగడ్డ సంస్కృతి అంటూ ఆల్లగడ్డ ప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్నా రు ...

* ఆధారాలతో, వాస్తవాలతో ఆరోపణలు చేయండి...అనవవసర ఆరోపణలతో

* ఒత్తిడి తో కేసులు పెట్టించి జైల్ కి మాత్రమే పంపుతారు...బైటి కి వచ్చిన తరువాత మాకు ఒకసారి అవకాశం వస్తుంది..

* శిల్పా మోహన్ రెడ్డి వ్యాపారాలు చేస్తున్నపుడు....నాగిరెడ్డి నాన్న బాలిరెడ్డి రాజకీయాల్లో వున్నారు

* రాజకీయాల గురించి భూమా కుటుంబం శిల్పా వారితో నేర్పించు కునే స్థితిలో లేదు

2020-10-30 12:17 GMT

 కర్నూల్....

* భూమా కుటుంబం పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు శిల్పా కుటుంబం

* అల్లగడ్డ గురించి మాట్లాడే హక్కు శిల్పా కుటుంభానికి లేదు...

* ఫ్యాక్షన్ వున్న ప్రాంతం లో శిల్పా కుటుంబం వ్యాపారం ఎలా చేస్తోంది

* దమ్ము దైర్యం వుంటే వారం రోజుల్లో నిజం నిరూపిస్తే రాజకీయాల నుండి శాశ్వితంగా వైదొలగుతా...

* లేకపోతే మీడియా ముఖంగా మాకు క్షమాపణ చెప్పాలి

* పోలీసుల మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు..

* తప్పుడు కేసులు మా మీద పెట్టే ప్రయత్నం చేస్తే మేమే మీ వెంట పడత

2020-10-30 11:08 GMT

కర్నూలు జిల్లా

-దళిత న్యాయవాది వైఎస్ఆర్సిపి నాయకుడైన సుబ్బరాయుడు ని దారుణంగా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ టీడీపీ నాయకుల తీరును తప్పుబట్టిన   నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి....

-దళిత న్యాయవాది సుబ్బరాయుడిని టిడిపి నాయకులు హత్య చేస్తే చంద్రబాబు నాయుడు, లోకేష్ లు ఏం చేస్తున్నారని ప్రశ్నించిన ఎమ్మెల్యే శిల్పా....

-దళితులపై దాడులు జరుగుతున్నాయని గగ్గోలు పెట్టే టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఈరోజు దళిత న్యాయవాది టిడిపి నాయకుల చేతుల్లో హత్యకు   గురైతే చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడని ప్రశ్నించిన ఎమ్మెల్యే శిల్పా....

-ఆళ్లగడ్డ ఫ్యాక్షన్ రాజకీయాలు నంద్యాల లో చేస్తే సహించేది లేదన్నారు ఎమ్మెల్యే శిల్పా...

-ప్రశాంతంగా ఉన్న నంద్యాల ప్రాంతాన్ని భూమా కుటుంబం వారి రాజకీయ లబ్ధి కోసం అరాచకాలు హత్యా రాజకీయాలు చేస్తే సహించబోమన్న ఎమ్మెల్యే     శిల్పా....

-సుబ్బారాయుడి హత్య కేసుకు సంబంధించి మరింత సమగ్ర దర్యాప్తు జరిపి ఈ హత్యకు కుట్ర వెనక ఉన్న నిందితులను చట్టపరమైన చర్యలు తీసుకొని   శిక్షించాలని పోలీసులను కోరిన ఎమ్మెల్యే శిల్పా...

2020-10-30 10:50 GMT

  శ్రీకాకుళం జిల్లా..

* ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ కామెంట్స్..

* ఇప్పటికే విభజనతో మనం తీవ్రంగా నష్టపోయాము..

* 2050 నాటికి ప్రపంచం గర్వించే రాజధాని కడతాను అంటున్నారు..

* ముందు మన స్థితిగతులు ఏమిటనే ఆలోచన లేకుండా రాజధాని కడితే ఏమిటి ప్రయోజనం ?

* మనది 63 శాతానికి పైబడి వ్యవసాయ ఆధారిత రాష్ట్రం..

* పొలాలు తీసేసి విమానాశ్రయం కడతే ఎవరికి లాభం ?

* వాస్తవాలు మాట్లాడితే విమర్శిస్తున్నాం అంటున్నారు..

2020-10-30 10:31 GMT

 శ్రీకాకుళం జిల్లా..

-మృతుడు సోంపేట మండలం ఎర్రముక్కాం గ్రామానికి చెందిన గోవింద వల్లభరావు(44) గా గుర్తింపు..

-అనారోగ్యంతో బాధపడుతూ అస్వస్థతకు గురై బెంగుళూరు సమీపంలో విమానంలో మృతి..

-గుజరాత్ లోని కాండ్లలో వలస కూలీగా ఉంటున్న వల్లభరవు..

-తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ స్వస్థలానికి విమానంలో బయల్దేరి మార్గ మధ్యలో మృతి.

Tags:    

Similar News