Live Updates: ఈరోజు (27 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-10-27 03:22 GMT
Live Updates - Page 4
2020-10-27 07:20 GMT

జాతీయం

గుంటూరులో టీడీపీ కార్యాలయం కోసం భూ కేటాయింపులపై ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ

ఏపీ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీకి నోటీసులు జారీ చేసినసుప్రీంకోర్టు

మూడు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశం

2020-10-27 07:19 GMT

విజయనగరం....

విజయనగరం పట్టణం లో సిరిమను జాతర సందర్భంగా భారీగా మోహరించిన పోలీసులు...

విజయనగరం పట్టణం మొత్తం 144 సెక్షన్ అమలు...

విజయనగరం పట్టణం మొత్తాన్ని తమ ఆంధీనం లోకి తీసుకున్న పోలీసులు..

అమ్మవారి ఆలయం కి వచ్చే అన్ని రహదారును బారికేడ్లు తో మూసివేత...

పట్టణం లో ఎక్కడ చూసినా అధిక సంఖ్యలో దర్శనం ఇస్తున్న పోలీసులు...

ప్రజలు గుడి వైపు రాకుండా ఎక్కడికక్కడ నియంత్రణ చేస్తున్న వైనం...

మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం కానున్న సిరిమను జాతర...

కేవలం 4 వేలు మంది మాత్రమే సిరిమను జాతర లో పాల్గొన్న అవకాశం ఉంది అని అంచనా...

ఎక్కడికక్కడ పోలీస్ పహారా తో సిరిమను జాతర కి దూరంగా ఉన్న ప్రజలు...

జిల్లా వ్యాప్తంగా 60 కి పైగా చెక్ పోస్ట్ ల్లో పట్టణం లోకి ఎవరూ రాకుండా , పట్టణం నుండి ఎవరు బయటకి వెళ్లకుండా ఆంక్షలు విధించిన పోలీసులు.....

100 పైగా సిసి కెమెరాలు తో కంట్రోల్ రూమ్ నుండి పర్యవేక్షణ....

విజయనగరం పట్టణము, ఆలయం పరిసరాల్లోని ఐదు కిలోమీటర్లు వరకు నిర్మానుష్యంగా మారిన రోడ్లు...

2020-10-27 07:19 GMT

విజయవాడ...

Hmtv తో మంత్రి వేణు

స్వార్ధ ప్రయోజనాలు కోసం రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద తక్కటు పెట్టిన వ్యక్తి చంద్రబాబు

బ్రేక్ అనుకున్న excilator తొక్కే వ్యక్తి లోకేష్..

లోకేష్ ప్రజల్లోకి ఎంత తక్కువ వస్తే అంత ఆయనకి మంచిది

పులివెందుల కు నీళ్లు ఇచ్చా అన్నే చంద్రబాబు కుప్పం కి ఎందుకు నీళ్లు ఇవ్వలేదు

జూమ్ బాబు ప్రజల్లోకి రాకుండా హైదరాబాద్ లో ఉండి మాట్లాడ్తున్నారు

స్వార్ధ రాజకీయలుకు కాలం చెల్లింది

86% పనులు టీడీపీ హయాంలో చేసాం అని చంద్రబాబు చెప్తున్నారు,ప్రజలు ఎందుకు మరి టీడీపీ ని ఓడించారు

పోలవరం నిర్మాణం వైసీపీ ప్రభుత్వం పూర్తి చేస్తుంది

Ysr ల చంద్రబాబు మార్క్ పథకం ఒక్కటి ఆయన చూపించగలరా..

రెండో విడత ysr రైతు బోరసా ఇచ్చి చరిత్రలోకి ఎక్కబోతున్నాం

2020-10-27 07:18 GMT

విశాఖ

ఎమ్మెల్యే…గొల్ల బాబురావు..కామెంట్స్..

జగనన్న వికాసం పథకం వల్ల దళితులకు, గిరిజనులకు లబ్ది చేకూరుతుంది

గిరిజనులు, దళితులు పై చదువులు చదివినా వారికి అవకాశాలు రాలేదని ఈ పథకం ద్వారా వారు లబ్ది పొందుతారు

ముఖ్యమంత్రి చేపట్టిన ఈ పథకం వలన గిరిజన, దళితులు పరిశ్రమలు స్థాపించుకోవచ్చు

ఈ పథకం కోటి రూపాయల వరకు ప్రభుత్వం మంజూరు

బాబా సాహెబ్ అంబెద్కర్ ఎన్నో వెసులుబాటు లతో రాజ్యాంగం రూపొందిస్తే దానిని కొంతమంది నాయకులే ఆచరణలో పెట్టారని వారిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒకరు

2020-10-27 07:18 GMT

అనంతపురం: తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి కామెంట్స్:

తాడిపత్రి మండలం బొందల దిన్నె వంగనూరు గ్రామంలోని భూములు రైతులు స్వచ్ఛందంగా విక్రయించారు.

ఆ భూములు రైతులకు ఇప్పిస్తామని రాజకీయం చేయడం సరికాదు. గ్రామాల్లో కక్షలు రేగేందుకు అవకాశం ఉంది.

గతంలో రైతులు విక్రయించిన ధరకు రూ.20 వేలు అధికంగా ఇస్తానని చెప్పడం సరికాదు.

ప్రస్తుతం మార్కెట్ ధర ప్రకారం రైతులు తమ భూములు కొనుగోలు చేయోచ్చు .

అక్రమ రిజిస్ట్రేషన్ ల పై కర్ణాటక రవాణాశాఖ అధికారులు స్పందించలేదు.

అందుకే లోకాయుక్తకు ఫిర్యాదు చేశాం.

నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించడం దివాకర్ ట్రావెల్స్ వారికే సాధ్యం.

2020-10-27 07:17 GMT

తిరుమల

శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, కోదాడ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్

కరోనా ప్రభావం నుంచి దేశం, ఇరు తెలుగు రాష్ట్రాలు కోలుకోవాలని కోరుకున్న

అకాల వర్షం కారణంగా రైతులు నష్టపోకుండా చూడాలని వేంకటేశ్వరుని వేడుకున్నా

మల్లయ్య యాదవ్,కోదాడ ఎమ్మెల్యే

2020-10-27 04:47 GMT

Maoist activities in AOB: ఏవోబీలో మావోయిస్టుల హల్ చల్

రెండు వాహనాలను దగ్ధం చేసిన మావోయిస్టులు

ఒడిశా మల్కన్ గిరిజిల్లా పప్పర్లమెట్ట అటవీ ప్రాంతంలో ఘటన

అప్రమత్తమైన బలగాలు.. మావోయిస్టులు, భద్రతాబలగాల మధ్య ఎదురుకాల్పులు

అలర్టైన విశాఖ జిల్లా పోలీసులు.. ఏవోబీలో నిఘా పెంపు

2020-10-27 04:45 GMT

CBI Court: ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి కేసుపై సేబీఐ కోర్టు విచారణ

ఏపీ సీఎం జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసుపై నేడు సీబీఐ కోర్ట్ విచారణ...

జగన్ పై ధాఖలైన అన్ని కేసులను విచారించనున్న సీబీఐ కోర్టు...

ప్రజాప్రతినిధులు కేసుల విచారణ లో భాగంగా జగన్ కేసులను సైతం విచారించనున్న సీబీఐ కోర్ట్.

2020-10-27 04:35 GMT

Vizianagaram updates: నేడు విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం

* కరోనా నేపథ్యంలో నిబంధనలతో భక్తులు అమ్మవారి దర్శనం..

* ఈరోజు కేవలం ఆన్లైన్ టికెట్లు బుక్ చేసుకున్న వారికి మాత్రం నేడు దర్శనం

* భక్తి జన సందోహం లేకుండా ఏకాంతంగా జరగనున్న సిరిమానోత్సవం

* కేవలం ఆలయ పూజారులు, సిబ్బంది, అధికారులు, పోలీసుల సమక్షంలో జరగనున్న పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం.

* ఇప్పటికే పూర్తయిన ఏర్పాట్లు

* 12 గంటల తర్వాత హుకుంపేట నుంచి బయలుదేరనున్న సిరిమాను రథం సహా ఇతర రథాలు..

* మధ్యాహ్నం 2 గంటల తర్వాత మొదలుకానున్న సిరిమానోత్సవం

* అమ్మవారి ఆలయం నుండి కోట వరకు మూడు పర్యాయాలు తిరగనున్న సినిమాలు రథం

* సాయంత్రం 5:30 లోపు సిరిమానోత్సవం పూర్తయ్యేలా ఏర్పాట్లు చేసిన అధికారులు...

* అమ్మవారిని దర్శించుకొని ప్రభుత్వం తరుఫున పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రి బొత్స,..

Tags:    

Similar News