Live Updates: ఈరోజు (27 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-10-27 03:22 GMT
Live Updates - Page 3
2020-10-27 09:51 GMT

East Godavari Updates: నిరాశ్రయులైన ప్రజలను, నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో విఫలమైంది..

తూర్పు గోదావరి జిల్లా - పెద్దాపురం..

- తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ప్రెస్ మీట్ కామెంట్స్...

- వరస వరదలు, వర్షాలు, తుపానులతో నిరాశ్రయులైన ప్రజలను, నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో విఫలమైంది

- తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రైతులు దైన్యపరిస్థితి పై నారా లోకేష్ క్షేత్రస్థాయిలో పరిశీలన చేపడితే అతనిని కించపరిచేలా మాట్లాడడం తగదు

- వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు కు చంద్రబాబు, లోకేష్ లను విమర్శించడం తప్ప రైతులను ఆదుకోవాలనే ఆలోచన లేనట్లు వుంది

- ఈ విపత్తు సమయంలో రైతులకు అండగా వుండాలని నారా లోకేష్ పర్యటిస్తున్నందునే లోకేష్ పై అక్రమ కేసులు అత్యుత్సాహం తో పెడుతున్నారు,

- తెదేపా ప్రభుత్వ హయాంలో పంట నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ కింద 3,100 కోట్ల తో ఆదుకున్నాం

- వైసీపీ ఎమ్మెల్యేనే ఏపీ సీడ్స్ వలన నష్టపోయాను అని గగ్గోలు పెడుతుంటే .....సామాన్య రైతులు పరిస్థితి ఏంటి....?

- మరి వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఏపీ సీడ్స్ వలన పంట నష్టపోయిన రైతులకు ఏమి సమాధానం చెబుతారు??

- పెట్టుబడికి సరియైన రాబడి రాక అప్పుల ఊబిలో రైతులు కూరుకుపోయారు.

2020-10-27 09:30 GMT

National Updates: పోలవరం ప్రాజెక్ట్ లో ఏం జరుగుతుంది? నిధుల విడుదల విషయంలో అయోమయం...

జాతీయం

-రఘురామకృష్ణంరాజు, నర్సాపురం ఎంపి

-పోలవరం ప్రాజెక్ట్ లో ఏం జరుగుతుంది? నిధుల విడుదల విషయంలో అయోమయం. తప్పు ఎవరిది? కేంద్ర ప్రభుత్వానిదా? రాష్ట్ర ప్రభుత్వానిదా? అని   కోస్తాఆంధ్రా ప్రజలు చర్చించుకుంటున్నారు.

-ప్రధానిగా మోడి ప్రమాణ స్వీకారం జరిగిన తరువాత జరిగిన మొదటి క్యాబినెట్ సమావేశంలో పోలవరం అథారిటీ ని ఏర్పాటు చేసారు . ప్రాజెక్ట్ నిర్మాణ పనులను దానికి అప్పగించారు

-పోలవరం అథారిటీ ఏర్పాటు అయిన ప్రాజెక్ట్ పనులను తమకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ ఏడుసార్లు రాసారు.

-రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేని పరిస్థితులలో ప్రాజెక్ట్ నిర్మాణపనులను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించారు.

-కేంద్ర సహాయం లేనిదే, రాష్ట్ర ప్రభుత్వం పోలవరం కట్టలేదా అని మా ప్రియతమ సీఎం గతంలో ప్రశ్నించారు? అదే ప్రశ్నను రాష్ట్ర ప్రజలు మా పార్టీని ప్రశ్నిస్తున్నారు.

-పోలవరం నిధులు విడుదలలో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం పై రాష్ట్రప్రభుత్వ వైఖరి తెలపాలి. సీఎం స్వయంగా జోక్యం చేసుకుంటే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు.

-సీఎం జగన్ తనపై ఉన్న కేసులకోసం పోలవరం నిర్మాణ వ్యయం విషయంలో రాజీపడ్డారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

-సీఎం ఆఫీసు కాని, పార్టీ ఆఫీస్ ప్రోద్బలంతో క్రైస్తవ సంఘాలు నాకు వ్యతిరేకంగా ఆందోళన చేసారు. నన్ను దళిత ద్రోహి అని నినాదాలు చేస్తున్నారు.

2020-10-27 07:28 GMT

విజయనగరం

పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం

పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు

అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన తమ్మినేని సీతారాం

2020-10-27 07:27 GMT

విజయవాడ

పైలా సోమినాయుడు, దుర్గ గుడి చైర్మన్.

శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా జరిగాయి. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఉత్సవాలను నిర్వహించాం.

కరోనా కారణంగా ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో సాధారణ భక్తులు, భవానీ దీక్షాపరులు చక్కగా సహకరించారు.

అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో ఉత్సవాలను చక్కగా నిర్వహించగలిగాం.

కొండచరియలు విరిగిపడిన ఘటనపై స్వయంగా పరిశీలించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. దేవాలయ అభివృద్ధికి రూ.70 కోట్ల నిధులు కేటాయించడం చారిత్రాత్మకం.

రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన దుర్గమ్మ దేవస్థానానికి

85 వేల మంది ఆన్లైన్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకుంటే, వారిలో దాదాపు 35 వేల మంది దర్శనానికి రాలేకపోయారు.

నేరుగా వచ్చే భక్తుల కోసం కరెంట్ బుకింగ్ ఏర్పాటుచేసాం.

శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దాదాపు 2 లక్షల మంది శ్రీ అమ్మవారిని దర్శించుకున్నారు.

ఈ ఉత్సవాల్లో దేవస్థానానికి రూ.4.36 కోట్ల ఆదాయం వచ్చింది.

అభివృద్ధి పనులకు త్వరితగతిన అంచనాలను రూపొందించాలని దేవాదాయ శాఖ మంత్రి ఆదేశించారు.

సురేష్ బాబు, ఈవో.

భక్తుల సౌకర్యాలు, రక్షణ చర్యలకు ఏవిధమైన లోటు లేకుండా అవసరమైన అన్ని ఏర్పాటు చేస్తున్నాం.

ఆన్లైన్ విధానాన్ని ప్రోత్సహిస్తూ భక్తులకు దర్శన ఏర్పాట్లు చేస్తున్నాం.

ఆన్లైన్ విధానంలోనే దర్శన టిక్కెట్లు బుక్ చేసుకోవాలి. భవానీ దీక్షా విరమణకు వచ్చే భక్తులు విధిగా ఆన్లైన్ టిక్కెట్లు తీసుకోవాలి.

2020-10-27 07:27 GMT

అనంతపురం: జే ఎన్ టి యు వి సి శ్రీనివాస్ కుమార్ కు బెదిరింపు ఫోన్ కాల్స్

కాలేజీ ల బకాయిలు చెల్లించకుండా.. నిబంధనల మేరకు కళాశాలలో వసతులు బోధనా సిబ్బంది లేకుండా అనుమతులు ఇవ్వాలని డిమాండ్

నిబంధనలు పాటిస్తే అంతు చూస్తానంటూ హెచ్చరికలు.

కళాశాలల యాజమాన్యాల తీరుపై ఆందోళన వ్యక్తం చేసిన విసి

అనంతపురం జే ఎన్ టి యు పరిధిలో 153 ఇంజనీరింగ్ కళాశాలలు.

నిజ నిర్ధారణ కమిటీ తనిఖీలు పూర్తి

బయటపడ్డ కళాశాల ల డొల్లతనం నిబంధనలు అమలుచేస్తే దాదాపు 50 కాలేజీ లకు పైగా ఈసారి ప్రవేశాలకు అనుమతుల నిరాకరణ

నిబంధనల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తున్న వీసీ శ్రీనివాస్ కుమార్.

యూనివర్సిటీ కి బకాయిలు రూ 30 కోట్ల వరకు రావాల్సి ఉంది

బకాయిలు చెల్లించకుండా అనుమతి ఇవ్వమని తేల్చి చెప్పిన వర్సిటీ

ఈ నేపథ్యంలోనే విసి పై కళాశాల యాజమాన్యం ఒత్తిడి

ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పి ఫోన్ లో బెదిరింపులు. పోలీసులకు ఫిర్యాదు చేయనున్న వి సి శ్రీనివాస్ కుమార్

2020-10-27 07:26 GMT

తిరుమల

నవంబరులో తిరుమలలో విశేష ఉత్సవాలు

తిరుమ‌ల‌లో న‌వంబ‌రు నెల‌లో ప‌లు విశేష ఉత్స‌వాలు జ‌రుగ‌నున్నాయి. వాటి వివ‌రాలు ఇలా ఉన్నాయి.

- న‌వంబ‌రు 14న దీపావ‌ళి ఆస్థానం.

- న‌వంబ‌రు 18న నాగుల చ‌వితి.

- నవంబర్ 20న పుష్పయాగానికి అంకురార్పణ.

- నవంబరు 21న తిరుమల శ్రీవారి పుష్పయాగ మహోత్సవం.

- నవంబరు 25న స్మార్త ఏకాదశి.

- నవంబరు 26న మధ్వ ఏకాదశి, క్షీరాబ్ది ద్వాద‌శి, చాతుర్మాస వ్ర‌త స‌మాప్తి, చ‌క్ర‌తీర్థ ముక్కోటి.

- నవంబరు 27న కైశిక ద్వాదశి ఆస్థానం.

- నవంబరు 29న కార్తీక దీపం, తిరుమంగై ఆళ్వార్ శాత్తుమొర‌.



 


2020-10-27 07:25 GMT

గుంటూరు...

ఎమ్మెల్యె మేరుగ నాగార్జున కామెంట్స్.

రాజధాని ప్రాంతంలోనే మూడు రాజధానులకు అనుకూలంగా ధర్నాలు చేయాల్సిన పరిస్థితి కల్పించారు.

మూడు రాజధానులకు అనుకూలంగా సిఎం నిర్ణయం తీసుకున్నారు. దానికి కట్టుబడి ఉన్నాం.

నా నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమమైనింగ్ పై విచారణ జరుగుతుంది.

నిబద్దతతో పనిచేస్తున్నాం.

పంట నష్టపోయిన రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోంది.

ప్రస్తుతం నష్టపోయిన రైతులకు వచ్చే నెలలో నష్టపరిహారం అందిస్తాం.

లైలా తుఫాన్ నష్టపరిహారం ఇప్పటికీ అందలేదు.

రైతులను ఉదారంగా ఆదుకునే ప్రభుత్వం ఇది...

2020-10-27 07:25 GMT

గుంటూరు.....

డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కామెంట్స్.

బాపట్ల మెడికల్ కాలేజ్ భూసేకరణ పూర్తయింది.

వచ్చే నెలలో కాలేజ్ నిర్మాణానికి శంఖు స్థాపన చేస్తాం.

జనవరి 26 నాటికి జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నాం.

వాన్ పిక్ విషయంలో రైతులను గుదరగోళంలో పడేయవద్దు.

రైతుల వద్ద నుండి మార్కెట్ రేటు కంటే అధిక ధరకు భూములు కొన్నారు.

రైతులు రిజిస్ట్రేషన్ కూడా చేశారు.

నిజాపట్నం పోర్టును అభివృద్ధి చేస్తాం.

నవంబర్ లో స్వల్పకాలిక శాసనసభ సమావేశాలు ఉండే అవకాశం ఉంది...

2020-10-27 07:21 GMT

Hmtv తో వైసీపీ ఎమ్మెల్యే రోజా

చంద్రబాబు, లోకేష్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫైర్

అయిదు సంవత్సరాల్లో చంద్రబాబు రౌడీ, గుండాయిజం చేసింది ప్రజలు అంత చూసారు

కుప్పనికి నీళ్లు ఇవ్వలేని వాడు పులివెందుల కు నీళ్లు ఇచ్చిం అన్ని మాయమాటలు చెప్తున్నారు

Ysr చేసిన పనులకు పేర్లు పెట్టి గేట్లు ఎత్తి నిను చేసాను అన్ని చంద్రబాబు చెప్పుకుంటారు

చంద్రబాబు అన్ని అబ్బాధాలు చెప్తున్నారు

చంద్రబాబు ను ఓడించి హైదరాబాద్ పంపించిన చంద్రబాబు జూమ్ లో మాట్లాడ్తున్న మాటలు చూసి ఇదేం టార్చర్ అని ప్రజలు అనుకుంటారు

చంద్రబాబు అవకాశ వాది రాజకీయనాయుడు

అన్ని వర్గాలు ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ బెస్ట్ ముఖ్యమంత్రుల్లో చోటు సంపాదించారు సీఎం జగన్

లోకేష్ కు బుర్ర,బుద్ధి, జ్ఞానం లేదు

లోకేష్ ను ఎప్పుడు అయితే రాజకీయాల్లోకి తీసుకొని వచ్చారు అప్పుడే చంద్రబాబు కు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది

లోకేష్ కు బ్రేక్ కు exicilator కు తేడా తెలియదు

ట్రాక్టర్ బోల్తా పడినట్టు...టీడీపీ పార్టీ బోల్తా పడుతుంది

2020-10-27 07:20 GMT

విజయనగరం..

పైడితల్లి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్తి బొత్స సత్యనారాయణ

Tags:    

Similar News