Live Updates: ఈరోజు (27 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
Amaravati Updates: వరదలతో నిండా మునిగిన రైతుల్ని గాలికొదిలేసారు...
అమరావతి
-ట్విట్టర్ లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్...
-రాజధానికి భూమి ఇచ్చిన రైతులకు బేడీలు వేసారు.
-ఇదేనా జగన్ రెడ్డి తెస్తానన్న రైతు రాజ్యం...?
-3 రాజధానుల ఆటో ఆర్టిస్టులను అడ్డుకున్నందుకే అంత కోపం వస్తే, తమ బతుకైన భూమిని ప్రజారాజధానికి త్యాగం చేసిన అన్నదాతలకు, అమరావతిని చంపేస్తుంటే ఎంత కోపం రావాలి...?
-రైతుల పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తేసి తక్షణమే విడుదల చేయాలి.
-లేదంటే, న్యాయం జరిగేవరకు రైతులతో కలిసి ఉద్యమిస్తాం.
Krishna District Updates: మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ విభాగంపై ఏసీబీ దాడులు...
కృష్ణాజిల్లా
మచిలీపట్నం
-టౌన్ ప్లానింగ్ సెక్షన్లో అవకతవకలపై ఏసీబీ కి ఫిర్యాదు చేసిన బాధితుడు
-మచిలీపట్నం శ్రీనివాస్ నగర్ కృష్ణవేణి ఐటిఐ కాలేజ్ నాన్ లే అవుట్లో 20 సంవత్సరాలుగా భవన నిర్మాణాలు
-నిర్మాణాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకొని మున్సిపల్ అధికారులు
-మున్సిపాలిటీకి నాలుగు కోట్లు నష్టం వచ్చినా పట్టించుకోని మున్సిపల్ కమిషనర్
-ఆర్ టి ఐ వేస్తే సమాధానమే చెప్పని మున్సిపల్ అధికారులు
-వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఏసీబీ ని కోరిన బాధితుడు
-నాన్ లే అవుట్ స్థలాలు అని 14 శాతం టాక్స్ వసూలు చేసిన బందరు మున్సిపాలిటీ
-స్థలాలు కొనుగోలు చేసిన వారి నష్టాన్ని బందరు మునిసిపాలిటీ చెల్లించాలని బాధితుడి డిమాండ్
-లేనియెడల కోర్టుకు వెళ్లి నష్టపరిహారం సాధిస్తామన్న బాధితుడు
Amaravati Updates: టిడిపి సీనియర్ నాయకులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్...
అమరావతి
-పాల్గొన్న 175నియోజకవర్గాల టిడిపి ఇన్ ఛార్జ్ లు, ప్రజా ప్రతినిధులు
-చంద్రబాబు ప్రసంగిస్తూ, ‘‘ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పట్ల బాధ్యతగా టిడిపి వ్యవహరిస్తోంది.
-కరోనాతో ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు అండగా ఉన్నాం.
-ఏపి ఫైట్స్ కరోనా వెబ్ సైట్ తో పేదలకు లబ్ది.
-కరోనా బాధితులను, దాతలను ఒకేవేదికపైకి తెచ్చి ఆదుకునే చర్యలు చేపట్టాం.
-అధికారంలో ఉండి వైసిపి బాధ్యతారహితంగా వ్యవహరిస్తోంది.
-వైసిపి అధికారంలోకి వచ్చాక ఒక్కో రైతుకు రూ రూ 77,500 ఎగ్గొట్టారు.
-‘‘రైతు భరోసా’’ పేరుతో 5ఏళ్లలో ఒక్కో రైతుకు వైసిపి ప్రభుత్వం ఇచ్చేది రూ37,500మాత్రమే..
-అదే టిడిపి ప్రభుత్వం వచ్చివుంటే అన్నదాత సుఖీభవ, రుణమాఫీ 4, 5కిస్తీల కింద, ఒక్కో రైతుకు రూ లక్షా 15వేలు వచ్చేది..ఒక్కో రైతుకు రూ 77వేల పైగా ఎగ్గొట్టి మీడియాలో గొప్పగా యాడ్స్ ఇవ్వడం వైసిపి నమ్మక ద్రోహం.
-ఎన్నికలకు ముందు విపత్తు సహాయ నిధి రూ 4వేలకోట్లు ఇస్తామని రైతులను నమ్మించారు.
-అధికారంలోకి వచ్చాక మాట తప్పారు, మడమ తిప్పారు.
-ఇప్పుడు రూ 500 ఇస్తామని, వారం రోజులు నీళ్లలో ఇళ్లు మునిగితేనే రేషన్ ఇస్తామంటూ వరద బాధితులతో చెలగాటం ఆడుతున్నారు.
-ఇళ్ల స్థలాల పంపిణీ ఎన్నిసార్లు వాయిదాలు వేస్తారు..?
-వివాదాల్లేని ఇళ్ల స్థలాల పంపిణీకి ఎవరడ్డం పడ్డారు..?
-కోర్టులకు వెళ్లింది వైసిపి బాధితులైతే టిడిపిపై దుష్ప్రచారం చేయడం వైసిపి చేతగానితనం.
-ఇళ్ల స్థలాలకు మడ అడవులను నరికివేస్తారా..?
-15అడుగులలోతు ముంపు భూముల్లో ఇళ్ల స్థలాలు ఇస్తారా..?
-కట్టిన ఇళ్లను, డిపాజిట్లు చెల్లించిన పేదలకు ఇవ్వరా...?
-ఏడాదిన్నరగా హవుసింగ్ పెండింగ్ బిల్లులు ఎందుకని నిలిపేశారు..?
-వైసిపి చేతగానితనానికి టిడిపిపై ఆడిపోసుకోవడం ఏమిటి..?
-చట్టాలను మీరు ఉల్లంఘిస్తూ టిడిపిపై కేసులు పెట్టడం ఏమిటి..?
Krishna District Updates: కె.బి చంద్రశేఖర్ డిగ్రీ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసారు...
కృష్ణాజిల్లా...
# కృష్ణా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ కె.బి చంద్రశేఖర్ డిగ్రీ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసారు
# డీగ్రీ రెండు, నాలుగవ సెమిస్టర్ ప్రయోగ పరీక్షలు ఈరోజు నుంచి నిర్వహణ
# ఈనెల 31 వరకు ప్రయోగ పరీక్షలు జరుగుతాయి
# నవంబరు 2నుంచి 12వరకు డిగ్రీ రెండో సెమిస్టర్ థియరీ పరీక్షలు
# యూనివర్సిటీ, అనుబంధ కళాశాలల్లో డిగ్రీ రెండో సంవత్సరం నాల్గవ సెమిస్టర్ పరీక్షలు ముగిశాయి
# 13,660మంది విద్యార్థులు హాజరయ్యారు
# నాల్గవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను త్వరలో విడుదల చేయనున్న యూనివర్సిటీ
Vizianagaram Updates: పైడితల్లి అమ్మవారి సిరిమానును దర్శించుకున్న శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం....
విజయనగరం :
-- సిరిమానును నాలుగవసారి అధిరోహించిన ఆలయ ప్రధాన పూజారి బంటుపల్లి వెంకటరావు
-- డిసిసిబి బ్యాంక్ నుండి సిరిమానోత్సవాన్ని తిలకించి, దర్శించుకోనున్న మంత్రి బొత్స సత్యనారాయణ
-- సిరిమాను పండుగకు దూరంగా రాజవంశీయుల వారసులు అశోక్ గజపతి రాజు
Vizianagaram Updates: ఘనంగా ప్రారంబమైన పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం...
విజయనగరం...
-అమ్మవారి ప్రదాన పూజారి బంటుపల్లి వెంకటరావు సిరిమాను అధిరోహించగా కదిలిన సిరిమాను.
-పాలదార, ఐరావతం, అంజలిరధం, బెస్తరివల ముందు కదలగా వెనుకగా అమ్మవారి సిరిమానోత్సవం కదలింది.
-కరోనా నిబందనలతో భక్తులు లేకుండా ఆలయ సిబ్బంది అతి కొద్దిమందితో జరుగుతున్న సిరిమానోత్సవం
-ప్రజలేవ్వరూ సిరిమాను కార్యక్రమంలో పాల్గొనకుండా పట్టణంలోని 15చోట్ల ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు.
Nellore District Updates: ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కు చేరుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి...
నెల్లూరు :--
-- జిల్లా వైసీపి సమన్వయ సమావేశానికి హాజరయ్యేదుకు నెల్లూరు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కు చేరుకున్న ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి..
-- సజ్జలకు స్వాగతం పలికిన జిల్లా ఇన్చార్జ్ మంత్రి బాలినేని శ్రీనివాసులు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి.
-- నెల్లూరు జిల్లాకు సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పలు అంశాలను సజ్జల రామకృష్ణా రెడ్డి దృష్టికి తీసుకువెళ్లిన మంత్రులు ఎమ్మెల్యేలు
-- సజ్జల రామకృష్ణా రెడ్డి తో భేటీ అయ్యేందుకు పెద్ద ఎత్తున R&B గెస్ట్ హౌస్ కి చేరుకున్న వైసిపి నేతలు, అభిమానులు...
Guntur District Updates: వ్యవసాయ శాఖ అదికారులు,వ్యవసాయ శాస్త్రవేత్తల పర్యటన...
గుంటూరు..
-ఫిరంగిపురం లోని మంగళగిరి ఎమ్మెల్యే వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయ శాఖ అదికారులు,వ్యవసాయ శాస్త్రవేత్తల పర్యటన...
-నకిలీ విత్తనాలు వలన నష్టపోయానని వ్యవసాయ అదికారులకు పిర్యాదు చేసిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి,
-ఆళ్ల రామకృష్ణారెడ్డి పొలంలో వేసినవి నకిలి విత్తనాలు కావు.
-పూత,పంట రాకపోతే నకిలీ సీడ్స్ అని నిర్దారిస్తాం...
-బీపీటీ సమానంగా ఉండాల్సింది..కొంత పంటలో ముందుగానే మెలకెత్తింది...
-ఒకే చోట రెండు రకాల విత్తనాలు నాటారు,అవి రెండు కలిశాయా అనే కోణంలో కూడ పంటను పరిశీలిస్తున్నాం..
-బాపట్ల వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు నివేదిక ఇచ్చిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటాం...
Seediri Appalaraju Comments: రెండో విడత రైతు భరోసా గొప్ప విషయం..
శ్రీకాకుళం జిల్లా..
-మంత్రి సీదిరి అప్పలరాజు కామెంట్స్..
-ఇటీవల పట్టాలు పొందిన గిరిజనులకు కూడా రైతు భరోసా అందించడం మంచి పరిణామం..
-విత్తనం వేసినప్పటి నుంచి పంట చేతికి వచ్చే వరకు వ్యవసాయానికి కావలసిన తోడ్పాటును ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అందిస్తోంది..
-గతంలో ఎన్నడూ రైతులకు ఇంత పెద్దఎత్తున అవసరాలు తీర్చిన సందర్భాలు లేవు..
-కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం మాకు అండగా ఉందనే భరోసా ప్రజల్లో కనిపిస్తోంది..
-గతంలో లేని విధంగా ఉద్యాన పంటలు పండించే రైతులకు రైతు భరోసా వర్తింపచేయడం గొప్ప విషయం..
-జలకళ పై ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది..
-రాబోయే రెండు మూడు నెలల్లో జలకళ పనులు పెద్దఎత్తున జరిగితే రబీకి ఎంతగానో ఉపయోగపడుతుంది..
Krishna District Updates: నందిగామ రైతుభరోసా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొడాలి నాని....
కృష్ణాజిల్లా
మంత్రి కొడాలి నాని
-- గతంలో కంటే ఇప్పుడు రైతులు సంతోషంగా ఉన్నారు
-- దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు పడ్డట్టు లోకేష్ పర్యటన ఉంది
-- చంద్రబాబు జూమ్ కి పరిమితమయ్యాడు
-- లోకేష్ కు ట్రాక్టర్ నడపటం రాదు, పార్టీని నడపటమూ రాదు
-- తెలుగుదేశంలో పార్టీలో ఉన్నవారు త్వరగా ట్రాక్టరు దిగకపోతే, ట్రాక్టరు మునిగిపోయినట్లు మీరు మునిగిపోతారు
-- ట్రాక్టరు డ్రైవరుగా కూడా అతను పనికిరాడు
-- లోకేష్ ట్రాక్టరును ఎలా ముంచేశాడో అలాగే పార్టీనీ ముంచివేస్తాడు
-- టీడీపీ శ్రేణులు ముందే మేల్కొనండి