Kurnool Updates: శ్రీశైలమహాక్షేత్రంలో అంగరంగ వైభవంగా కార్తీక మాసోత్సవాలు...
కర్నూలు జిల్లా..
* రెండవ కార్తీక సోమవారం కావడం వేకువజామునే స్వామి అమ్మవార్ల దర్శనానికి క్యూలైన్లలో అర కిలో మీటర్ బారులు తీరిన భక్తులు
* ప్రధాన ఆలయ ముందుభాగాన గంగాధర మండపం, నాగుల కట్ట వద్ద కార్తీక దీపాలను వెలిగిస్తుంది భక్తులు
* కోవిడ్ నిబంధనలను పాటిస్తూ భక్తుల దర్శనాలకు ఏర్పాట్లను చేసిన ఆలయ కార్యనిర్వహణాధికారి కె.ఎస్.రామారావు
Anantapur Updates: శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు!
అనంతపురం:
* తాడిపత్రి పట్టణంలో కార్తీక మాసం రెండవ సోమవారం పురస్కరించుకుని శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు.
* ఆలూరు కోన లోని శ్రీ రంగనాథ స్వామి, యాడికి మండలం లోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు.
* కోవిడ్ నిబంధనలను అనుసరించి భక్తులకు దర్శనం కల్పిస్తున్న ఆలయ కమిటీలు
Rajahmundry Updates: రాజమండ్రి- గోదావరి రేవులలో కానరాని భక్తులు...
తూర్పుగోదావరి- రాజమండ్రి
* కార్తీక మాసం రెండో సోమవారం కూడా రాజమండ్రి- గోదావరి రేవులలో కానరాని భక్తులు,,?
* కోవిడ్-19వల్ల గోదావరి స్నానఘట్టాలలోస్నానాలు ఆచరించొద్దని అధికారులు నిషేధాజ్ఞలు
* వెలవెల బోతున్న స్నాన ఘట్టాలు
Tirumala Updates: శ్రీవారిని దర్శించుకున్న భక్తులు!
తిరుమల సమాచారం
*నిన్న శ్రీవారిని దర్శించుకున్న 32,640 మంది భక్తులు.
*నిన్న తలనీలాలు సమర్పించిన 10,946 భక్తులు.
*నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.26 కోట్లు.
Anantapur Updates: పుట్టపర్తిలో ఘనంగా సత్యసాయి జయంతి..
అనంతపురం:
* ప్రపంచం ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో ఘనంగా సత్యసాయి జయంతి.
* కోవిడ్ 19 నిబంధనల నేపథ్యంలో ఆంక్షలు.
* ఆన్లైన్లోనే సత్యసాయి మహా సమాధి దర్శనం.
Kurnool Updates: నాలుగవ రోజు కొనసాగుతున్న తుంగ భద్ర పుష్కరాలు..
కర్నూల్..
-కార్తీకమాసం సోమవారం కావడంతో అధిక సంఖ్యలో ఘాట్ల కు తరలివస్తున్న భక్తులు
-పిండప్రదానాలు, ప్రత్యేక పూజలు ,గంగమ్మ హారతి లో పాల్గొంటున్న భక్తులు
-పుణ్యస్నానాలు లేకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటుచేసిన షవర్ కింద స్నానం
-తుంగభద్రలో కార్తీకదీపాలను వదిలి మొక్కలు తీర్చుకుంటున్న భక్తులు
-పలువురు ఘాట్ లలో సంప్రోక్షణ చేసుకోడానికి కూడా భక్తులకు అందని తుంగభద్రమ్మ
-కేవలం షవర్ నీటి తోనే సరి పెట్టుకోవాలని సెలవిస్తున్నా అధికారులు..
Kurnool Updates: కార్తీక సోమవారం సందర్భంగా ఆలయాలు భక్తులతో కల కలలాడుతున్నాయి..
కర్నూల్
* శ్రీశైలం, మహానంది, యాగంటి ,ఓంకారం, కాల్వబుగ్గ, రుద్రకోడూరు ,మంత్రాలయం ఆలయాల వద్ద దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు
* పుణ్య స్నానాలకు ఆలయాల లో ఉన్న కోనేర్ల లో అనుమతి లేకపోవడంతో ఇంటివద్దనే స్నానాలు ఆచరించి స్వామి అమ్మవారి దర్శనానికి తరలివస్తున్న భక్తులు
* కోవిడ్ నిబంధనలు అనుసరించి భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిన ఆలయ అధికారులు
* గర్భాలయ ప్రవేశం ,స్పర్శ దర్శనాలు నిలిపివేత
* భౌతిక దూరం పాటిస్తూ సామూహిక అభిషేకాలు, హోమాలు, స్వామివారి కల్యాణం నిర్వహణ
* గౌరీ నోములు, కేదారేశ్వర నోము లకు సంబంధించి ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు
* వేకువజాము నుండే కార్తీక దీపం వెలిగించి స్వామి,అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివస్తున్న భక్తులు