Live Updates: ఈరోజు (10 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 10 నవంబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు మంగళవారం | 10 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | దశమి: రా.10-29 తదుపరి ఏకాదశి | పుబ్బ నక్షత్రం రా.2-50 తదుపరి ఉత్తర | వర్జ్యం: ఉ.11-40 నుంచి 1-11 వరకు | అమృత ఘడియలు రా.8-46 నుంచి 10-17 వరకు | దుర్ముహూర్తం: ఉ.11-21 నుంచి 12-06 వరకు | రాహుకాలం: సా.3-00 నుంచి 4-30 వరకు | సూర్యోదయం: ఉ.06-06 | సూర్యాస్తమయం: సా.05-23
ఈరోజు తాజా వార్తలు
అనంతపురం:
యస్,విష్ణువర్ధన్ రెడ్డి, బి.జె.పి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
-నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ప్రజలు ఆమోదించి దేశంలో పలు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారు.
-బీహార్, మధ్యప్రదేశ్ ఫలితాలే ఇందుకు నిదర్శనం.
-దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ హావా కొనసాగింది.
-తెలంగాణలో ఉప ఎన్నికల్లో గెలవడం బీజేపీకి మరింత ఊతమిస్తోంది
-ఆంధ్రప్రదేశ్ లో జరిగే తిరుపతి ఉప ఎన్నికల్లో బిజెపి ప్రజలముందుకు వస్తుంది.
-వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దౌర్జన్యాలు, ప్రజావ్యతిరేక విధానాలకు తిరుపతి ప్రజలు బీజేపీకి మద్దతు ఇచ్చి వైసీపీకి బుద్ధి బీజేపీ చెబుతారు.
విజయవాడ
* సిఎం ఆర్ ఎఫ్ చెక్కులు మార్చి భారీ మొత్తం కాజేసేందుకు కుట్ర
* నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సీఐడీ పోలీసులు
* జార్ఖండ్ నుండి పీటీ వారెంట్ మీద తీసుకొస్తుండగా పారిపోయిన నిందితుడు
* రెండు రోజుల క్రితం జరిగిన ఘటన, గోప్యంగా ఉంచిన సీఐడీ పోలీసులు
* నిందితుడిపై జార్ఖండ్ లో పలు కేసులు.
జాతీయం
- 121 స్థానాల్లో ముందంజలో ఎన్డీఏ,113 స్థానాల్లో ముందంజలో మహాకూటమి
- 2015 ఎన్నికలతో పోలిస్తే మెరుగైన బిజెపి స్థానాలు
- 63 స్థానాల్లో ముందంజలో బిజెపి,51 స్థానాల్లో ముందంజలో జేడీయూ
- 77 స్థానాల్లో ముందంజలో ఆర్జేడీ,23 స్థానాల్లో ముందంజలో కాంగ్రెస్
- 7 స్థానాల్లో ఎల్జెపి ముందంజ
జాతీయం...
- 118 స్థానాల్లో ముందంజలో ఎన్డీఏ,116 స్థానాల్లో ముందంజలో మహాకూటమి
- 2015 ఎన్నికలతో పోలిస్తే మెరుగైన బిజెపి స్థానాలు
- 61 స్థానాల్లో ముందంజలో బిజెపి,50 స్థానాల్లో ముందంజలో జేడీయూ
- 79 స్థానాల్లో ముందంజలో ఆర్జేడీ,23 స్థానాల్లో ముందంజలో కాంగ్రెస్
కృష్ణాజిల్లా....
- ద్విచక్ర వాహనాన్ని వేగంగా ఢీ కొట్టిన లారి
- ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న యువకుడు అక్కడికక్కడే మృతి
- ఒక బాలునికి తీవ్ర గాయాలు
- 108 వాహనంలో నందిగామ తరలింపు
- ఇరువురు వత్సవాయి మండలం వేములనర్వ గ్రామానికి చెందిన వారిగా గుర్తింపు.
కర్ణాటక:
-రెండో రౌండ్ పూర్తయ్యేసరికి బీజేపీ అభ్యర్థి రాజేష్ గౌడ్ ముందంజ.
-నాలుగో రౌండ్ లోను ఆర్ ఆర్ నగర్ లో బీజేపీ హావా..
-రెండు చోట్ల ఆధిక్యం లో దూసుకుపోతున్న బీజేపీ అభ్యర్థులు.
జాతీయం..
-అధికార ఎన్డీఏను వెనక్కి నెట్టిన మహాకూటమి
-84 స్థానాల్లో ముందంజలో ఉన్న మహాకూటమి అభ్యర్థులు, 62 స్థానాల్లో ముందంజలో ఉన్న ఎన్డీఏ
-5 స్థానాల్లో ముందంజలో ఎల్జేపి
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం పార్టీ వారీగా చూస్తే భాజపా 50, జేడీయూ 34, ఆర్జేడీ 52, కాంగ్రెస్, 16, ఎల్‌జేపీ 4, ఇతరులు 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. 73 స్థానాల్లో ఇంకా ఓట్ల కౌంటింగ్ మొదలు పెట్టలేదు.
కర్ణాటక:
- రెండు అసెంబ్లీ ఎన్నికలు, 4 ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
- రాజరాజేశ్వరి నగిర్, శిరా ఉప ఎన్నికల లెక్కింపు తో పాటు ఇటీవల జరిగిన నాలుగు ఎమ్మెల్సీ స్థానాల ఓట్ల లెక్కింపు ప్రారంభం.
నెల్లూరు :
-- ఇన్ ఫ్లో 8033 క్యూసెక్కు లు.ఔట్ ఫ్లో 7100 క్యూసెక్కు లు.
-- ప్రస్తుత నీటి మట్టం 74.553 టీఎంసీ లు.పూర్తి నీటి మట్టం 77.988 టీఎంసీలు