Live Updates: ఈరోజు (04 నవంబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-11-04 02:18 GMT
Live Updates - Page 2
2020-11-04 10:59 GMT

Warangal Urban Updates: కాళోజి ఆరోగ్య విశ్వావిద్యాలయం విసి కరుణాకర్ రెడ్డి మీడియా సమావేశం..

వరంగల్ అర్బన్:

-కాళోజి ఆరోగ్య విశ్వావిద్యాలయం

-కాళోజి హెల్త్ యూనివర్సిటీ లో ఎంబీబీఎస్, బి డి ఎస్ అడ్మిషన్లు ప్రారంభం..

-ఇప్పటి వరకు 6వేల మంది రిజిస్ట్రేషన్స్...

-నిట్ ర్యాంకు ఉన్న విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు...

-రాష్ట్ర వ్యాప్తంగా 4800 సీట్ల...

-ఈడబ్ల్యుఎస్ 190 సీట్లు..

-గవర్నమెంట్ కాలేజీలల్లో 1500 సీట్లు... ప్రయివేట్ కాలేజీలల్లో 2750 సీట్లు...

-మైనార్టీ కాలేజీలల్లో 550 సీట్లు... కొత్తగా మరో కాలేజీ..

-13 డెంటల్ కాలేజీలలో 1340 సీట్లు..

-వెబ్ ఆప్షన్లు ద్వారా సీట్ల కేటాయింపు...

-కరోనా నేపథ్యంలో ఆన్ లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్..

-కాలేజ్ స్టాట్ అయిన తరువాత ఫిజికల్ వెరిఫికేషన్...

-సర్టిఫికెట్ అప్లోడ్ చేయకపోతే నాట్ క్వాలిఫైడ్..

-కరోనాను బట్టి ప్రభుత్వం ఇచ్చే ఆదేశాల మేరకే క్లాస్స్ స్టార్ట్...

2020-11-04 05:40 GMT

CBI Court: సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల విచారణ..

సీబీఐ కోర్టు....

-జగతి పబ్లికేషన్స్ లో పెట్టుబడుల చార్జ్ షీట్ నుంచి తనను తొలగించాలన్న జగన్ డిశ్చార్జి పిటిషన్ పై నేడు కొనసాగునున్న వాదనలుCBI 

-గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కుంభకోణం కేసు విచారణ నేడు విచారణ...

2020-11-04 05:37 GMT

Nizamabad Updates: చలో ఆర్మూర్ మహా ధర్నాకు భారీ బందోబస్తు..

నిజామాబాద్ జిల్లా..

-రైతులు ఆందోళన చేసిన సమయస్ఫూర్తి కోల్పో వద్దని పోలీస్ సిబ్బందికి సూచించిన ఆర్మూర్ ఏ సి పి రఘు

-3 ఏ సి పి, 9 సిఐలు, 8ఎస్ ఐ, ఏ ఎస్ ఐ లతో కలిపి 300 మంది సిబ్బందితో బందోబస్తు

2020-11-04 05:36 GMT

International Updates: అమెరికా అధ్యక్ష ఎన్నికలలో విజయానికి చేరువలో బైడెన్‌!

  అంతర్జాతీయం..

- డెమొక్రాటిక్‌ పార్టీ అమెరికా అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌.. ప్రత్యర్థి, రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ పై ఆధిక్యం

- ఇప్పటి వరకు బైడెన్‌కు 209 ఎలక్టోరల్‌ ఓట్లు రాగా, ట్రంప్‌నకు 112 ఓట్లు

- బైడెన్‌ మ్యాజిక్‌ ఫిగర్‌ అందుకోవటానికి ఇంకా 61 ఓట్లు మాత్రమే కావాల్సి ఉంది.

2020-11-04 05:32 GMT

Nalgonda Updates: చౌటుప్పల్ వెళ్తున్న కాంగ్రెస్ నేతలు!

నల్గొండ జిల్లా..

-చౌటుప్పల్ వెళ్తున్న కాంగ్రెస్ నేతలు మనిక్కమ్ ఠాగూర్, ఉత్తమ్, పొన్నం ప్రభాకర్..

-ఏపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మస్తాన్ వలి కుమారుడు రాత్రి చౌటుప్పల్ వద్ద రోడ్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.

-సంఘటనను పరిశీలించి మస్తాన్ వలి ని పరామర్శించేందుకు చౌటుప్పల్ బయలుదేరిన తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు.

2020-11-04 05:14 GMT

Kamareddy Updates: విషాదం గా ముగిసిన చిన్నారి సౌమ్య అదృశ్యం..

కామారెడ్డి :

-ఎల్లా రెడ్డి మండలం మత్త మాల నిజం సాగర్ బాక్ వాటర్ ప్రాంతం లో బయట పడ్డ సౌమ్య మృత దేహం.

-అపహరించి చిన్నారిని హత్య చేసారా అనే కోణం లో పోలీసుల దర్యాప్తు

-ఇంటి ముందు ఆడుకుంటూ అదృశ్యం అయిన రెండేళ్ల చిన్నారి సౌమ్య.

2020-11-04 05:10 GMT

Laxmi Barrage Updates: లక్ష్మీ బ్యారేజ్ కి కొనసాగుతున్న వరద..

జయశంకర్ భూపాలపల్లి జిల్లా..

-4 గేట్లు ఎత్తిన అధికారులు

-పూర్తి సామర్థ్యం 100.00 మీటర్లు

-ప్రస్తుత సామర్థ్యం 98,60 మీటర్లు

-ఇన్ ఫ్లో 22,270 క్యూసెక్కులు

-ఔట్ ఫ్లో 9,670 క్యూసెక్కులు

2020-11-04 05:02 GMT

Nizamabad Updates: దర్పల్లి మండలం దుబ్బాక రామాలయం లో చోరీ..

నిజామాబాద్ :

-హుండీ డబ్బులు ఎత్తుకెళ్లిన దుండగులు.

-ఆలయ గేట్ తాళాలు పగులగొట్టి చొరబడిన దొంగలు, విచారణ చేపట్టిన పోలీసులు.

2020-11-04 05:00 GMT

Kamareddy Updates: మిస్టరీ గా మారిన రెండేళ్ల చిన్నారి సౌమ్య అదృశ్యం!

కామారెడ్డి :

-24 గంటలు గడుస్తున్నా.. దొరకని ఆచూకీ.

-ఎల్లా రెడ్డి మండలం మత్త మాల లో నిన్న ఆడుకుంటూ అదృశ్య మైన చిన్నారి

-సౌమ్య జాడ కోసం గాలిస్తున్న పోలీసులు.

-పాపను ఎత్తుకెళ్లారా.. కిడ్నప్ చేశారా? అనే కోణం లో దర్యాప్తు.

2020-11-04 04:57 GMT

Warangal Rural Updates: నెక్కొండ మండలం సూరిపల్లి గ్రామంలో విషాదం..

 వరంగల్ రూరల్ జిల్లా:

-నెక్కొండ మండలం సూరిపల్లి గ్రామానికి చెందిన ఊడుగుల రాజయ్య వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య.

-ఎక్సైజ్ అధికారుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు అంటు బంధువుల ఆరోపణ.

-ఊడుగుల రాజయ్య అనే వ్యక్తి బెల్టుషాపు నిర్వాహకుడు..

-లాక్ డౌన్ సమయంలో ఊడుగుల రాజయ్య కు చెందిన 70,000 రూపాయల విలువ గల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ సిఐ శశికుమారి..

-స్వాధీన పరచుకొన్న మద్యం బాటిళ్లను తిరిగి ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు అని కుటుంబ సభ్యుల ఆరోపణ..

Tags:    

Similar News