ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్
దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలవబోతుందో.
సీఎం కేసీఆర్ గత ఆరు సంవత్సరాలుగా ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు.
కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టు ను కట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కె దక్కుతుంది.
గతంలో జరిగిన అన్ని రకాల ఎన్నికల్లో టిఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలిచింది.
బిజెపి నిరాశ, నిస్పృహతో మా దళిత ఎమ్మెల్యే క్రాంతిపై దాడి ఘటన సిగ్గుచేటు.
దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం.
బిజెపి నేతల దగ్గర పోలీసులకు దొరికిన డబ్బును కూడా వారి కార్యకర్తలే ఎత్తుకెళ్లారు.
తెలంగాణలో మాకు ప్రజలే బాసులు..
డబ్బును విచ్చలవిడిగా వెదజల్లి, ప్రజలను భయబ్రాంతులకు గురిచేసే ఘటనలకు పాల్పడ్డారు.
కేంద్రం నుండి తెలంగాణకు పెద్దగా సహాయం అందడం లేదు.
మిషన్ కాకతీయకు 24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పింది.. పట్టించుకోలేదు.
జిఎస్టీ నిధుల కోసం టిఆర్ఎస్ ఎంపీలం పార్లమెంట్ లో పోరాడినం.
ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి.
Saraswathi Barrage Updates: సరస్వతి బ్యారేజ్ కి కొనసాగుతున్న వరద...
జయశంకర్ భూపాలపల్లి జిల్లా
* 3 గేట్లు ఎత్తిన అధికారులు
* పూర్తి సామర్థ్యం 119.00 మీటర్లు
* ప్రస్తుత సామర్థ్యం 118.20 మీటర్లు
* పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ
* ప్రస్తుత సామర్థ్యం 9.00 టీఎంసీ
* ఇన్ ఫ్లో 4,000 క్యూసెక్కులు
* ఔట్ ఫ్లో 2,700 క్యూసెక్కులు
Hyderabad Floods Updates: హైదరాబాద్ లో కొనసాగుతున్న వరద ల ఎఫెక్ట్...
హైదరాబాద్..
* నాలాలో పడి మరో వృద్ధురాలి మృతి
* ఉదయం నడకకు వెళ్లి ప్రమాదవశాత్తు నాలలో పడి మరణించిన మహిళ
* సరూర్ నగర్ చెరువు కింద ప్రాంతంలో ఇంకా పొంగుతున్న నాలాలు
* శారదా నగర్ లో ఎనభై ఏళ్ల సరోజ వాకింగ్ కు వెళ్లి ప్రమాద వశాత్తు నాలా లో పడి కొట్టుకుపోయిన ఘటన
* వెంటనే రంగంలోకి దిగిన ghmc సిబ్బంది,DRF టీమ్
* గాలింపు చర్యల్లో చైతన్యపురి లోని హనుమాన్ నగర్ నాలలో మృతదేహం లభ్యం
Revanthreddy Comments: కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పై తప్పుడు ప్రచారాలకు తెగబడ్డాయి...
ఎంపీ రేవంత్ రెడ్డి ..టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్.
• దుబ్బాకలో బీజేపీ, టీఆర్ఎస్ లు కాంగ్రెస్ ను నేరుగా ఎదుర్కోలేక వెన్నుపోటు రాజకీయానికి తెర తీశాయి.
• ఫేక్ న్యూస్ లను వ్యాప్తిలో పెట్టి ప్రజలలో గందరగోళాన్ని సృష్టించే కుట్రకు ఆ రెండు పార్టీలు సిద్ధపడ్డాయి .
• ఫేక్ న్యూస్ వ్యాప్తి వెనుక హరీష్, రఘునందన్ ఉన్నారు.
• తప్పుడు వార్తలను వ్యాప్తి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను .
• ప్రజలు అనవసర గందరగోళాలకు గురి కావద్దు... దుష్ర్ఫచారాలపై అప్రమత్తంగా ఉండి... స్వేచ్ఛగా ఓటేయాలని కోరుతున్నాను .
Nalgonda Updates: మిర్యాలగూడ లో రైతుల ఆందోళన ...
నల్గొండ :
-ధాన్యం కోనుగోళ్లను నిలిపేసిన మిల్లర్లు ..మిల్లుల వద్ద భారీగా నిలిచిన ధాన్యం ట్రాక్టరు లు..
-మిల్లులవద్ద రద్దీ ఉందని ....మరొక 24 గంటలపాటు ధాన్యం మిల్లులవద్దకు తీసుకువచ్చి ఇబ్బంది పడొద్దని రైతులకు పోలీసుల సూచన..
Dubbaka Updates: రామక్కపేట లోని పోలింగ్ బూత్ లో మొరాయించిన ఈవిఎం..
సిద్దిపేట:
* ఆలస్యంగా ప్రారంభమైన పోలింగ్
* మండలం బొప్పాపూర్ గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్న బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు
* నార్సింగి మండలం లో 8:00 గంటల వరకు 11.5 % వోటింగ్ నమోదు
* సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్ గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్న కాంగ్రెస్ అభ్యర్థి పేరు శ్రీనివాస్ రెడ్డి
* దుబ్బాక మున్సిపాలిటీ దుంపలపల్లి బూత్ నంబర్ 50 లో మొరాయించిన ఈవీఎంలు ఇంకా ప్రారంభం కానీ పొలింగ్
Telangana Updates: వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్న తెలంగాణ కాంగ్రెస్...
తెలంగాణ ..
* కేంద్ర వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్న తెలంగాణ కాంగ్రెస్.
* మహబూబ్ నగర్ జిల్లాలో జరిగే కార్యక్రమానికి హాజరవుతున్న టీపీసీసీ ఇంచార్జ్ మనిక్కం ఠాగూర్.
Siddipet Updates: దుబ్బాక నియోజకవర్గ వ్యాప్తంగా ప్రారంభమైన పోలింగ్..
సిద్దిపేట:
....పోలింగ్ కేంద్రాల వద్ద కోవిడ్ నిబంధనల మేరకు ఓటర్లకు థర్మల్ పరీక్షలు, సానిటైజేషన్, గ్లౌస్ లు అందిస్తున్న వైద్య సిబ్బంది
.... పోలింగ్ బూత్ ల వద్ద సామాజిక దూరం పాటించేలా ఏర్పాట్లు
Dubbaka by-election: నార్సింగి మండల కేంద్రంలో ప్రారంభమైన పోలింగ్...
దుబ్బాక ఉప ఎన్నిక..
* ఓటర్లకు covid నియమాలతో ఒక్కొక్కరికీ ప్రత్యేక గ్లౌజులు అందజేస్తున్న సిబ్బంది.
* ఒక్క ఓటర్ ఆరు గజాల దూరం పాటిస్తూ ఓటు వేయాలని సూచిస్తున్న అధికారులు.
Siddipet Updates: శ్రీనివాస్ రెడ్డి టీఆరెస్ లో చేరుతున్నట్లు సోషల్ మీడియా లో ప్రచారం..
.....దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి టీఆరెస్ లో చేరుతున్నట్లు సోషల్ మీడియా లో ప్రచారం..
.... బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు, మంత్రి హరీష్ రావు ల కుట్ర అని ఆరోపిస్తున్న శ్రీనివాస్ రెడ్డి
.... సోషల్ మీడియా లో జరుగుతున్న ప్రచారం పై తొగుట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి