Do you know this: మార్నింగ్ రన్నింగ్, వాకింగ్ కంటే ముందుగా ఈ తప్పులు అసలే చేయకండి
Health tips for runners and walkers: మార్నింగ్ రన్నింగ్, వాకింగ్ కంటే ముందు ఇలా చేస్తే ఈజీగా మీ లక్ష్యం నెరవేరుతుంది.

Do you know this: మార్నింగ్ రన్నింగ్, వాకింగ్ కంటే ముందుగా ఈ తప్పులు అసలే చేయకండి
Fitness guide for healthy life: మార్నింగ్ రన్నింగ్ , వాకింగ్ అనేది హెల్తీ లైఫ్ కు మంచి అలవాటు. శరీరం, మనసు ఉత్తేజంగా, రోజంతా ఉత్సాహంగా ఉంచడంలో ఈ మార్నింగ్ వాక్, రన్నింగ్, జాగింగ్ ఎంతో ఉపయోగపడతాయి. అంతేకాదు... అధిక బరువును తగ్గించడంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి. అయితే, అంతకంటే ముందు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే...
1) వాటర్ తాగడం తప్పనిసరి... ఎందుకంటే...
వాటర్ తాగకుండా వాకింగ్ వెళ్లకూడదు. ఎందుకంటే రాత్రంతా కనీసం 6 నుండి 8 గంటలపాటు నీరు తాగకుండా ఉండి ఉంటారు. అందుకే మీ శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండాలంటే ఉదయం నిద్ర లేవగానే కనీసం ఒకటి లేదా రెండు గ్లాసులు నీరు తాగాలి.
నీరు తాగకుండా వాకింగ్ వెళ్తే, చమట రావడం వల్ల మీ ఒంట్లో ఉండే కొద్దిపాటి నీరు కూడా చమట రూపంలో బయటికి పోవడం వల్ల కొద్దిసేపట్లోనే మీరు అలసిపోతారు. మీ లక్ష్యాన్ని చేరకుండానే అలసటతో మధ్యలోనే వెనుదిరుగాల్సి వస్తుంది. కాదని ముందుకు వెళ్తే... కళ్లు తిరగడం, కండరాలు నొప్పి రావడం, తలనొప్పి లాంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది.
2) లైట్ డైట్
చాలామంది వ్యాయామం, వాకింగ్ అనగానే ఖాళీ పొట్టతోనే చేయాలి అనే అపోహలో ఉంటారు. కానీ బలహీనంగా ఉండే వారికి లేదా నీరసంగా ఉన్న సమయంలో ఖాళీ కడుపుతో వాకింగ్ కు వెళ్లొద్దు. అలా చేయడం వల్ల త్వరగా అలసిపోతారు. కొన్నిసార్లు నీరసం ఎక్కువైతే కళ్లు తిరిగి పడిపోవడం కూడా జరుగుతుంది.
అందుకే పరిగడుపున తినగలిగే ఏదైనా ఒక పండు, లేదా జ్యూస్ లాంటి లైట్ డైట్ తీసుకుని వాకింగ్ కు వెళ్లాలి.
3) వాకింగ్ కు ముందు తప్పకుండా వామప్
రాత్రి పడుకున్న సమయంలో కొన్ని గుంటల తరబడి కండరాల కదలిక లేకుండా శరీరం బిగుతుగా, పట్టేసినట్లుగా ఉంటుంది. అలాగే వాకింగ్ కు వెళ్తే దీర్ఘ కాలంలో మోకాలి నొప్పులు, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు ఎదురవుతాయి.
అయితే, 2 లేదా 3 నిమిషాలు వామప్ చేయడం వల్ల కండరాల్లో చలనం వచ్చి వాకింగ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. పాదాలు, మడమ, చేతులు, భుజాలు, నడుం అటు ఇటు తిప్పినా చాలు... ఆ తర్వాత అరగంట మీ శరీరం మీ మాట వింటుంది. సమస్యలు లేకుండా చూసుకుంటుంది.
4) టీ, కాఫీలు వద్దు... లెమన్ వాటర్, జీర వాటర్ ముద్దు
కొంతమందికి నిద్ర లేవగానే టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కానీ వాకింగ్ కు వెళ్ళే ముందు అవి తాగడం మంచిది కాదు.
ముఖ్యంగా కాఫీలోని కెఫైన్ మీ ఒంట్లోని నీటి శాతాన్ని పీల్చుకుంటుంది. దానికితోడు వాకింగ్ చేసేటప్పుడు వచ్చే చమట వల్ల బాడీ త్వరగా డీహైడ్రేట్ అయి అంతే త్వరగా అలసిపోతారు. అది మీ లక్ష్యాన్ని దెబ్బ తీస్తుంది.
ఒకవేళ టీ, కాఫీలు అలవాటు ఉంటే, వాటి స్థానంలో నిమ్మకాయ నీరు లేదా జీర వాటర్ లాంటివి తాగాలి. లెమన్ వాటర్ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. జీర వాటర్ జీర్ణ శక్తిని ఇంప్రూవ్ చేస్తుంది.