Spicy Garlic Chutney: ఇడ్లీ దోశలకు అదిరిపోయే స్పైసీ వెల్లుల్లి చట్నీ రెసిపీ
Spicy Garlic Chutney Recipe: ఉదయం లేవగానే బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరి. సాధారణంగా ఇడ్లీ లేదా దోశ చేసుకుంటాం. అయితే ఇందులోకి ఎప్పుడో ఒకే రకం పల్లీలు, పుట్నాల చట్నీ మాత్రమే కాదు.

Spicy Garlic Chutney: ఇడ్లీ దోశలకు అదిరిపోయే స్పైసీ వెల్లుల్లి చట్నీ రెసిపీ
Spicy Garlic Chutney Recipe: ఉదయం లేవగానే బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరి. సాధారణంగా ఇడ్లీ లేదా దోశ చేసుకుంటాం. అయితే ఇందులోకి ఎప్పుడో ఒకే రకం పల్లీలు, పుట్నాల చట్నీ మాత్రమే కాదు. ఈరోజు మేము చెప్పబోయే స్పైసీ వెల్లుల్లి చట్నీ కూడా తయారు చేసుకొని చూడండి. ఇడ్లీ, దోశ రెండిటిలోకి అదిరిపోతుంది.
చాలామంది ఉదయం లేవగానే దోశ, ఇడ్లీ తింటారు. కొంతమంది పూరి ఆలు కుర్మా తింటారు. అయితే ఇడ్లీ, దోశ తినేవారు స్పైసీ వెల్లుల్లి చట్నీ ఎప్పుడైనా తయారు చేసుకున్నారా? కేవలం కొబ్బరి చట్నీ మాత్రమే కాదు ఇలాంటి రుచికరమైన చట్నీ వల్ల దోశ ఇడ్లీలోకి అదిరిపోతుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలి తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు..
వెల్లుల్లి రెబ్బలు 100 గ్రాములు
కరివేపాకు
ఎండుమిరపకాయలు -5
చిన్న ఉల్లిపాయలు -7
చింతపండు కొద్దిగా
నూనె, ఉప్పు- తగినంత
స్పైసీ వెల్లుల్లి చట్నీ తయారు చేసుకునే విధానం..
ముందుగా స్టవ్ ఆన్ చేసి ఓ బాండీ పెట్టి అందులో నూనె పోసి వెల్లుల్లి, చింతపండు ఎండుమిర్చి గోల్డెన్ రంగులో వచ్చేవరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఇది చల్లారనివ్వండి. ఇప్పుడు ఇందులో ఉప్పు కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
ఇప్పుడు మరో చిన్న తాలింపు గిన్నె తీసుకొని అందులో నూనె ఆవాలు, జీలకర్ర కరివేపాకు వేసి వేయించుకోవాలి. చిటపటలాడిన తర్వాత దీన్ని చట్నీలో వేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన స్పైసీ వెల్లుల్లి చట్నీ రెడీ అయిపోతుంది. దీని ఇడ్లీ, దోశలు మాత్రమే కాదు చపాతీలో కూడా అదిరిపోతుంది. ఎప్పుడైనా కూర లేకపోతే అన్నం లో కూడా టేస్ట్ చేసి చూడండి.