Plum fruit: ప్లం ఫ్రూట్ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..!
Plum fruit: ప్లం ఫ్రూట్ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..!
Plum fruit: రుచిలో పుల్లగా, తీపిగా ఉండే ప్లం ఫ్రూట్ గుండె సంబంధిత వ్యాధులకి చాలా మేలు చేస్తుంది. రక్తపోటు వంటి వ్యాధులను నయం చేస్తుంది. ఈ పండు తినడం వల్ల రక్తం గడ్డకట్టదు. గుండె పనితీరు మెరుగ్గా ఉంటుంది. ఎందుకంటే ఇందులో తగినంత పొటాషియం ఉంటుంది. ఇది గుండెపోటు అవకాశాలను తగ్గిస్తుంది. ప్లం ఫ్రూట్‌ని ఆంగ్లంలో ప్లం అంటారు. ఇవి చిన్న ఎరుపు రంగు పండ్లు. ఇవి పుల్లని-తీపి రుచిని కలిగి ఉంటాయి. కట్ చేసినప్పుడు లోపల లేత పసుపు రంగులో ఉంటుంది. ఈ పండులో ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది. అంతేకాదు చాలా పోషకాలు కలిగి ఉంటుంది.
ప్లం ఫ్రూట్ మలబద్ధకం సమస్యని దూరం చేస్తుంది. ప్లం ఫ్రూట్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి చాలా ఉపయోగపడుతుంది. ఇందులో సూపర్ ఆక్సైడ్ ఉంటుంది. ఇది శరీరంలో ఉన్న కొవ్వును తగ్గిస్తుంది. కరోనా కాలంలో ఎక్కువగా చర్చించిన పదం రోగనిరోధక శక్తి. గత సంవత్సర కాలంగా ప్రజలు రోగనిరోధక శక్తిని మెరుగుపరిచే అనేక పండ్లను తింటున్నారు. ప్లం కూడా ఈ పండ్లలో ఒకటి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ పండ్లలోని ఐరన్ రక్త కణాల వృద్ధికి తోడ్పడుతుంది. రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది. రక్తహీనత సమస్య ఉన్నవారికి చాలా బాగా పనిచేస్తుంది.
ఈ మధ్య కాలంలో రక్తహీనత సమస్య చాలా ఎక్కువగా వినపడుతుంది. ఈ సమస్య ఉన్నవారు ఈ పండు తింటే మంచి ప్రయోజనం కనపడుతుంది. ఈ పండు తినటం వలన ముడతలు తొలగిపోయి చర్మం యవ్వనంగా కనపడుతుంది. ప్లమ్‌లలో బోరాన్ ఉంటుంది. ఇది ఎముకల్ని దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. పైగా ప్లమ్‌లో ఫ్లేవనాయిడ్స్, ఫెనోలిక్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి ఎముకల్ని తిరిగి బాగుచేస్తాయి. కీళ్ల నొప్పులు ఉన్నవారు ప్రతి రోజు ఒక పండు తింటే నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.