Leg Pain: మీకు ఉదయం లేచిన వెంటనే కాళ్లలో నొప్పి అనిపిస్తోందా? అయితే ఈ ప్రాణాంతక వ్యాధి కావచ్చు
Leg Pain Reasons: చాలామందిలో ఉదయం లేవగానే కాళ్ల నొప్పులు అనుభవిస్తారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి..

Leg Pain: మీకు ఉదయం లేచిన వెంటనే కాళ్లలో నొప్పి అనిపిస్తోందా? అయితే ఈ ప్రాణాంతక వ్యాధి కావచ్చు
Leg Pain Reasons: చాలామందిలో ఉదయం లేవగానే కాళ్ల నొప్పులు అనుభవిస్తారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి..
ఉదయం లేచిన వెంటనే చాలామందికి కాళ్లలో నొప్పి అనుభూతి చెందుతారు. దీనికి అనేక కారణాలు కావచ్చు. సాధారణంగా రక్త ధమనుల ద్వారా రక్తం మన శరీరంలోని అనేక భాగాలకు చేరుతాయి. అయితే ధమనులు మూసుకుపోవడం వల్ల గుండె ప్రమాదం కూడా వచ్చే అవకాశం ఉంది. శరీరంలో ధమనుల ద్వారా రక్తం సరఫరా అవుతుంది . అయితే ఈ సిరలు మూసుకుపోయినప్పుడు కాలంలో అనేక లక్షణాలు కనిపిస్తాయి.
ప్రధానంగా సిరలు మూసుకుపోవడానికి కొవ్వు పేరుకుపోవడమే కారణం. దీనివల్ల మాత్రమే కాదు ధూమపానం వల్ల కూడా ఇలాగే జరుగుతుంది. సరైన వ్యాయామం చేయకపోవడం వల్ల కూడా సిరలు మూసుకుపోతాయి. తద్వారా కాళ్లలో తిమ్మిరి అనుభూతి చెందుతారు. ఉదయం లేవగానే కాళ్లలో తిమ్మిరి ఉంటుంది. దీంతో వైద్యులను సంప్రదించాలి.
ఇది మాత్రమే కాదు మరి కొంతమందికి కాళ్లలో నొప్పి అనుభూతి చెందుతారు. ఇది కూడా కాళ్లలో సిరలు మూసుకుపోవడం వల్ల కూడా జరుగుతుంది. కొంతమందికి మరింత బలహీనంగా అనుభూతి చెందుతారు. వెంటనే వైద్యులను సంప్రదించాలి.
ఇక కాళ్లపై కొన్ని ఎరుపు రంగు మచ్చలు కనిపించుతాయి. గాయాలు త్వరగా మానవు. ఇది కూడా డయాబెటిస్ వల్ల జరగవచ్చు. సిరలో అడ్డంకులు ఏర్పడినప్పుడు మీ గోళ్ళలో మెరుపు కూడా తగ్గుతుంది. తద్వారా వెంటనే వైద్యులను సంప్రదించాలి.