High Blood Pressure: బీపీని తగ్గించే పసుపు.. ఎలాగో తెలుసా..?

Blood Pressure: ప్రతి భారతీయ ఇంటిలో కచ్చితంగా ఉండే పదార్థాల్లో ఉండే వాటిలో పసుపు ప్రధానమైంది.

Update: 2025-02-16 01:53 GMT
How Turmeric Helps to Control High Blood Pressure Naturally

High Blood Pressure: బీపీని తగ్గించే పసుపు.. ఎలాగో తెలుసా..?

  • whatsapp icon

Blood Pressure: ప్రతి భారతీయ ఇంటిలో కచ్చితంగా ఉండే పదార్థాల్లో ఉండే వాటిలో పసుపు ప్రధానమైంది. దాదాపు ప్రతీ ఒక్క వంటకంలో కచ్చితంగా పసుపును ఉపయోగిస్తుంటాం. కేవలం వంటకు రుచిని మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే రక్తపోటును తగ్గించడంలో కూడా పసుపు ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. పసుపులో ఉండే కర్కుమిన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలు రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, బిపి స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడతాయి.

అధిక రక్తపోటుకు ముఖ్యమైన కారణాల్లో శరీరంలో వాపు పెరగడం ఒకటి. పసుపులోని కర్కుమిన్ రక్తనాళాల్లో వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా రక్తప్రసరణ మెరుగుపడి, బిపి స్థాయిలు నియంత్రణలోకి వస్తాయి. పసుపులోని కర్కుమిన్‌ రక్తనాళాల విస్తరణకు సహాయపడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇది అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇక పసుపులోని యాంటీఆక్సిడెంట్లు, రక్తనాళాలకు హాని కలిగించే ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో సహాయపడతాయి. ఇది రక్తపోటును నియంత్రించడంలో కీలకంగా పనిచేస్తుంది. కర్కుమిన్ రక్తనాళాలను విశ్రాంతి తీసుకునేలా చేయడం ద్వారా, నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇది ధమనుల గోడలపై ఒత్తిడిని తగ్గించడంతో రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

పసుపును టీ లేదా పాలలో కలుపుకుని తీసుకోవడం ద్వారా బీపీ అదుపులో ఉంటుంది. వేడి నీటిలో 1 టీ స్పూన్ పసుపును కలపాలి. అలాగే ఇందులో చిటికెడు నల్ల మిరియాల పొడి, తేనె లేదా నిమ్మరసం కలుపుకోవాలి. ఇలా రోజు ఒకసారి మరీ ముఖ్యంగా ఉదయం తీసుకుంటే క్రమంగా అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది. పాలు పసుపు కలుపుకొని తాగినా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే దీనిని గోల్డెన్‌ మిల్క్‌గా చెబుతుంటారు. గోరు వెచ్చని పాలలో 1/2 టీ స్పూన్ పసుపు కలుపుకొని తాగాలి. రోజూ ఉదయం ఇలా తాగితే శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. ఇది అధిక రక్తపోటును అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. 

Tags:    

Similar News