ముఖానికి మొటిమలు వస్తే ఏం చేయాలి?

Update: 2020-06-10 17:23 GMT

మగువలు అందంగా కనబడాలంటే మొదటి స్థానం ముఖానికే అని చెప్పాలి. కొంతమంది ముఖం చూస్తే నున్నగా, మృదువుగా ఉంటుంది. మరికొంత మందిని చూస్తే ముఖం అంతా మొటిమలతో నిండిపోయింటుంది. ఈ మొటిమలు కారణంగా చాల మంది అమ్మాయిలు బాధ పడుతూ ఉంటారు. మరి ఈ మొటిమలు మటుమాయం అవ్వటానికి చాల మంది రోజంతా ముఖం కడుక్కోంటూ ఉంటారు. ఇలా చేయటం వలన మొటిమలు తగ్గుతాయని అభిప్రాయ పడుతుంటారు. రోజంతా ముఖం కడుక్కోవడం వలన మొటిమలు ఏ మాత్రం తగ్గవు. మరి మొటిమలు వస్తే ఏం చేయాలి? తెలుసుకుందాం..

* మొటిమల సమస్యలు ఉన్నవారు స్క్రబ్‌ చేయకండి. ఎందుకంటే స్క్రబ్బింగ్‌ వల్ల చర్మ సమస్యలు మరింత ఎక్కువవుతాయి. కాబట్టి మొటిమలతో బాధపడే వారు స్క్రబ్బింగ్‌కు దూరంగా ఉండటం చాల ఉత్తమం

* ముఖం అతిగా కడగడం లాంటివి చేస్తే చర్మంలోని సహజ నూనెలు తగ్గి సమస్య మరింత ఎక్కువ అవుతుంది. ఇలా చేయడం వల్ల ముఖంలోని సహజ తేమ తగ్గి నూనె ఉత్పత్తి పెరుగుతుంది.

* జంక్‌ఫుడ్‌ అధికంగా తీసుకోవడం, నిద్రలేమి, ఒత్తిడి కారణంగా కూడా మొటిమల సమస్య తీవ్రంగా ఉంటుంది. తాజా పండ్లు, కూరగాయలు తీసుకొని, నీటిని ఎక్కువగా తాగుతుంటే మొటిమల సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.


Tags:    

Similar News