ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండటానికి ప్రతిరోజు నీరు త్రాగడం చాల అవసరం. రోజు మొత్తం చెమట ద్వార కోల్పయిన నీటిని తిరిగి మరల భర్తీ చేయడం ఎంతో ముఖ్యం. నీటిలో క్లోరిన్, అయోడి్న్, ఆక్సిజన్ వంటి వాయువులు సమపాళ్ళలో ఉంటే మనిషి ఎప్పుడూ ఆరోగ్యంగానే ఉంటాడు. ప్రతిరోజు కనీసం 10-12 గ్లాస్సుల నీరు త్రాగడం వలన ఆరోగ్యనికి చాల ప్రయోజనాలు కల్గుతాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. చల్లాటి నీరు కాకుండా గోరువెచ్నని నీరు త్రాగడం వలన ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి.
గోరువెచ్చని నీటిలో తేనె, మిర్యాలపొడి కలుపుకొని తాగితే.. రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. తేనె, మిర్యాలపొడిలో యాంటీబయాటిక్ లక్షణాలుంటాయి. వీటిని గోరువెచ్చని నీటీలో కలుపుకొని తాగితే వైరస్‌లు మన దరికి చేరవంటున్నారు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.ప్రతిరోజు గోరు వెచ్చని నీరు తాగడం వల్ల చర్మం మరియు జుట్టు ఆరోగ్యంగా ఉంటాయాని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
గోరువెచ్చని నీటిని తీసుకోవటం వలన మలబద్దకం వంటి సమస్యలు కూడా దూరమవుతాయట. అరకప్పు గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ తేనె, వేయించిన వాము కలిపి తాగితే అజీర్ణం వల్ల వచ్చే కడుపునొప్పి తగ్గుతుంది. మనలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. అందుకే సరైన ఆహారం తీసుకోవాలి. పండ్లు, ఆకుకూరలు, తాజాగా ఉండే ఆహారాన్నే తీసుకోవాలి.