Lifestyle: ఏ పని చేయకపోయినా రోజంతా అలసటగా ఉంటోందా.? ఈ విటమిన్ లోపం ఉన్నట్లే
Vitamin Deficiencies: గాఢమైన నిద్ర ప్రతి ఒక్కరికీ అవసరం. కానీ కొంతమంది ఎక్కువగా నిద్రపోతారు. సరిపడా నిద్ర ఉన్నా ఎప్పుడూ అలసటగా ఉంటారు.

Lifestyle: ఏ పని చేయకపోయినా రోజంతా అలసటగా ఉంటోందా.? ఈ విటమిన్ లోపం ఉన్నట్లే
Vitamin Deficiencies: గాఢమైన నిద్ర ప్రతి ఒక్కరికీ అవసరం. కానీ కొంతమంది ఎక్కువగా నిద్రపోతారు. సరిపడా నిద్ర ఉన్నా ఎప్పుడూ అలసటగా ఉంటారు. ఎలాంటి పనిలేకపోయినా రోజంతా అలసటతో ఉండడానికి శరీరంలో విటమిన్లు లోపం ఉందని అర్థం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో కొన్ని ముఖ్యమైన విటమిన్లు లేకపోవడం కూడా దీనికి కారణం కావచ్చు. ఈ విటమిన్లు మన శరీరానికి శక్తిని అందించడంలో, మెదడును ఉత్తేజపరచడంలో, నిద్రను నియంత్రించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ వ్యాసంలో శరీరంలో ఏ విటమిన్ లోపం వల్ల అధిక నిద్ర వస్తుందో తెలుసుకుందాం.
* శరీరంలో సరిపడ విటమిన్ బి6 లేకపోతే నిద్రలేమితో పాటు, పగటిపూట కూడా నిద్రమత్తుగా అనిపించడం ప్రారంభమవుతుంది. శరీరానికి సరిపడ విటమిన్ బి6 లభించాలంటే అరటిపండ్లు, గింజలు, తృణధాన్యాలు, పాలకూర, బంగాళాదుంపలు మొదలైన వాటిని తీసుకోవాలి.
* మన శరీరంలో విటమిన్ బి12 ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీని సహాయంతో మెదడు, నాడీ వ్యవస్థను చురుగ్గా ఉంచుతుంది. శరీరానికి బి12 లభించకపోతే.. మానసిక అలసట, బలహీనత, నిరంతరం నిద్రలేమి సమస్య ఉండవచ్చు. శరీరంలో విటమిన్ బి12 అవసరాన్ని తీర్చడానికి పాలు, గుడ్డు, చేపలు, మాంసం, పెరుగు, జున్ను మొదలైన వాటిని తీసుకోవాలి.
* శరీరంలో ఫోలేట్ లేదా విటమిన్ B9 లోపం మెదడు పనితీరును ప్రభావితం చేస్తుంది. నిత్యం నీరసంగా ఉండేందుకు ఈ విటమిన్ లోపం కారణమవుతుంది. దీంతో తరచుగా నిద్రపోతున్నట్లు భావన కలుగుతుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఆహారంలో ఆకుకూరలు, పప్పుధాన్యాలు, సిట్రస్ పండ్లు, మొలకెత్తిన ధాన్యాలు మొదలైన వాటిని చేర్చుకోవాలి.
* శరీరంలో విటమిన్ డి లోపం వల్ల కండరాల బలహీనత, ఎముకల నొప్పి, అలసట పెరుగుతాయి. దీని కారణంగా మీరు రోజంతా నిద్రపోతున్నట్లు భావన కలుగుతుంది. విటమిన్ డీ లోపం నుంచి బయటపడాలంటే సూర్యరశ్మి, పాలు, గుడ్డులోని పచ్చసొన, పుట్టగొడుగులు, బలవర్థకమైన ఆహారాలు మొదలైనవి తీసుకోవాలి.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. ఆరోగ్యానికి సంబంధించినంత వరకు వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.