నిజామాబాద్‌లో జంట హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. కంఠేశ్వర్‌లో ఓ ఇంట్లో అద్దెకుంటున్న ఇద్దరు యువకులను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. మూడు రోజుల క్రితం ఈ హత్యలు జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఇటు విషయం తెలుసుకున్న ఏసీపీ శ్రీనివాస్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. హత్యలు ఎవరు చేశారు అందుకు కారణాలేంటనే దానిపై విచారణ చేపట్టారు. మృతులు కర్ణాటక ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. మృత దేహాలను పోస్టు మార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.