అక్కడ ఏజెన్సీ సర్టిఫికేట్ ఉంటే చాలు ఉద్యోగం..

Update: 2019-04-28 06:27 GMT

అక్కడ ఏజెన్సీ సర్టిఫికేట్ ఉంటే చాలు ఉద్యోగం జేబులో ఉన్నట్టే అందుకే అడ్డదారులు తొక్కుతున్నారు టిఆర్టీ ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులు ఉద్యోగాల కోసం కొందరు బోగస్ ఎజెన్సి సర్టిఫికేట్లను సమర్పిస్తున్నారు. మరి బోగస్ ఏజెన్సీ సర్టిపికేట్లతో అర్హులకు న్యాయం జరిగేనా? టీచర్ల ఎంపిక లో బోగస్ సర్టిఫికేట్ల దందా పై హెచ్ఎంటివీ ప్రత్యేక కథనం.

సర్కార్ ఉద్యోగాల కోసం ఉపాధ్యాయ వృత్తికి మచ్చ తెచ్చేవిధంగా అభ్యర్థులు వ్యవహరించారు. తెలంగాణ ప్రభుత్వం ఖాళీగా ‌ ఉపాద్యాయులను నియమించడానికి టీఆర్టీటీ పరీక్ష నిర్వహించి ఫలితాలు వెల్లడించింది. ఆదిలాబాద్ జిల్లాలో పలితాల అనంతరం సర్టిఫికేట్ల కోసం‌ ఒక పోస్టు కు ముగ్గురు అభ్యర్థులను పిలిచారు మొత్తం జిల్లాలో 423పోస్టులకు 778 అభ్యర్థుల సర్టిపికేషన్ చేశారు. వీటిలో నాలుగు వందల ఎజెన్సి సర్టిఫికేట్లు బోగస్ ఏజెన్సి సర్టిఫికేట్లుగా గుర్తించారు అధికారులు. స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్టు విషయంలో ఇదేవిధమైన పరిస్థితి ఉంది యాబై మంది అభ్యర్థుల సర్టిఫికేట్ వేరిపికేషన్ చేయగా ముప్పై మంది అభ్యర్థుల సర్టిఫికేట్లు బోగస్ గుర్తించి పెండింగ్ పెట్డారు అధికారులు.

ఏజెన్సీ సర్టిఫికేట్ పోందాలంటే గిరిజనుడై ఉండాలి కానీ ఇవేమీ లేకుండా రెవిన్యూ అదికారులు మాముళ్లు తీసుకొని బోగస్ సర్టిఫికేట్లు జారీ చేశారన్నఅరోపణలు ఉన్నాయి. బోగస్ ఎజెన్సి సర్టిఫికేట్లతో నియమాకాలు చేపడితే గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని గిరిజన సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బోగస్ ఏజెన్సి సర్టిఫికేట్లను సమర్పించిన‌ వారిపై అధికారులు విచారణ ప్రారంభించారు..మెరిట్ జాబితాతో మళ్లీ ఎజెన్సి సర్టిఫికేట్ల పరిశీలన చేస్తామని విద్యాశాఖాధికారి చెబుతున్నారు.అదేవిధంగా బోగస్ సర్టిఫికేట్ల సమర్పిస్తే వాటిపై చర్యలు తీసుకుంటామని హెచ్చారించారు. ఏజెన్సీ ప్రాంతంలో నిజమైన గిరిజన అభ్యర్ధులను ఉపాధ్యాయులుగా ఎంపిక చేయాలని పలువురు కోరుతున్నారు.

Full View

Similar News