యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో ఇటీవల వెలుగు చూసిన శ్రావణి హత్యకేసు ఉదంతం మరువకముందే మరో యువతి హత్య వెలుగు చూసింది. యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్‌లో మృతదేహాల మిస్టరీ కొనసాగుతోంది. టెన్త్ విద్యార్ధిని శ్రావణి డెడ్‌బాడీ దొరికిన బావిలోనే మరో అమ్మాయి మృతదేహం లభించడం తీవ్ర కలకలం రేపుతోంది. శ్రావణిని గ్యాంగ్ రేప్ చేసి మృదేహాన్ని పడేసిన హాజీపూర్ బావిలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు మరో అమ్మాయి డెడ్‌బాడీని వెలికితీశారు.
హాజీపూర్ బావిలో మరో అమ్మాయి మృతదేహం కనిపించడంతో గ్రామంలో మళ్లీ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో భారీ బందోబస్తు మధ్య మనీషా మృతదేహాన్ని బావి నుంచి బయటికి తీశారు పోలీసులు. బావి నుంచి బయటికి తీసిన మృతదేహాన్ని హాజీపూర్‌కి చెందిన మనీషాగా గుర్తించారు. రెండు నెలల క్రితం అదృశ్యమైన మనీషా హాజీపూర్ బావిలో శవమై తేలడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
టెన్త్ విద్యార్ధిని శ్రావణిని గ్యాంగ్ రేప్ చేసి, చంపినట్లే మనీషాను కూడా సామూహిక అత్యాచారం తర్వాత చంపి... మృతదేహాన్ని బావిలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. శ్రావణి కేసులో అరెస్టైన నిందితుడే మనీషాను కూడా చంపి ఉంటాడని భావిస్తున్నారు. ఇదే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే శ్రావణి రేప్ అండ్ మర్డర్ కేసు నిందితుడు మనీషాను కూడా హత్య చేశానని ఒప్పుకున్నట్లు సమాచారం అందుతోంది. హాజీపూర్ గ్రామానికి చెందిన మనీషా రెండు నెలల క్రితం అదృశ్యమైంది. డిగ్రీ చదువుతున్న మనీషా ప్రేమ వ్యవహారంలో ఇంటి నుంచి వెళ్లిపోయి ఉంటుందని తల్లిదండ్రులు భావించారు. దాంతో పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. అయితే ఇప్పుడు శ్రావణి మృతదేహం దొరికిన బావిలోనే మనీషా డెడ్‌బాడీ కూడా కనిపించడంతో గ్రామంలో కలకలం రేగింది.
హాజీపూర్ బావిలో మరో అమ్మాయి మృతదేహం దొరకడంతో గ్రామంలో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో గ్రామంలో పెద్దఎత్తున బలగాలను మోహరించారు. మరోవైపు బావి నుంచి వెలికి తీసిన మనీషా మృతదేహాన్ని .... హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కి తరలించారు. శ్రావణి రేప్ అండ్ మర్డర్ కేసులో ఇప్పటివరకు 15మంది యువకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. బొమ్మలరామారం, హాజీపూర్, మల్యాల గ్రామాల్లో దాదాపు 100మంది జులాయిల వివరాలు సేకరించిన పోలీసులు 8మంది అనుమానితుల స్పెర్మ్‌ను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపారు. గతంలోనూ హాజీపూర్‌లో రెండు అత్యాచార ఘటనలు జరగడంతో ఆ కేసుల్లోని నిందితుల పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.