రూంకి వస్తే డబ్బులు ఇస్తానని...చివరకుకర్నూలు జిల్లా మూడో పట్టణ పోలీసు ఠాణా పరిధిలో గత మార్చి 1న కేసీ కెనాల్లో అవుపించిన శవానికి సంబంధించిన కాళ్లు, చేతులు లభ్యమయ్యాయి. అయితే ఈ కేసును పోలీసు అతి త్వరలోనే చేధించారు. ఆ కేసుకు సంబంధించిన నింధితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. కెనల్ హత్య కేసు వివరాలను మూడో పట్టణ సీఐ హనుమంతనాయక్ మంగళవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. సీఐ హనుమంతనాయక్ తెలిపిన వివరాల ప్రకారం కర్నూలు జిల్లా జూపాడు బంగ్లా (మం) పారుమంచాల గ్రామానికి చెందిన ప్రేమరాజు, జుబేదాబీ ఇదే గ్రామంలో ఉంటున్నారు. వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే గత కొద్ది నెలల తరువాత జుబేదాబీ బేతంచెర్లకు ఓ వ్యక్తితో వివాహం జరిగింది. ఆ తర్వాత ప్రేమరాజు కర్నూలుకు వచ్చి స్వామిరెడ్డినగర్‌లో నివాసం ఉంటున్నాడు. ప్రేమ్ కుమార్ స్థానికంగా ఓ టింబర్ డిపో యజమాని వద్ద చెట్టునరికే పనిలో సెట్ అయ్యాడు. అయితే జుబేదాబీ వివాహం తరువాత కూడా వీరిద్ధరి మధ్య తిరిగి వివాహేతర సంబంధం కొనసాగించాడు. అయితే వీరి సంబంధంలో భాగంగా ప్రేమరాజు జుబేదాబీ వద్ద రూ. లక్షకు పైగా అప్పు చేశాడు. గత ఫిబ్రవరి 25వ తేదీన జుబీదాబీ వల్ల అత్తకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. కాగా అక్కడికి ప్రేమరాజును పిలిచి డబ్బులు ఇవ్వమని ఒత్తిడి చేసింది.
దీంతో రేపు ఇస్తానని అన్నాడు. 26తేదీన జుబేదాబీని తన గదికి రమ్మన్నాడు ప్రేమరాజు. అలాగే అని డబ్బుతెచ్చుకుందాం అని వెళ్లింది అయితే ఇదే అదునుగా చేసుకున్న ప్రేమ్‌రాజు ఎలాగైన జుబేదాబీ మట్టుపెట్టాలని స్కేచ్ వేసాడు. ఆ రోజు తన గదికి వచ్చిన జుబేదాబీ ఆ తనతో గడిపింది. జుబేదాబీ నిద్రపోతున్న సమయంలో ఆమె మెడకు నైలాన్ తాడు బిగించి చంపేశాడు. అయితే తన శవాన్ని ముక్కలు ముక్కలుగా చేసి మూటలుగా కట్టాడు. కాగా అదే రోజు రాత్రి నుంచి మూడు రోజుల పాటు మృతదేహ శరీర భాగాలున్న మూటలను ఒక్కొక్కటిగా కేసీలో పడేశాడు. ఆ తర్వాత స్వామిరెడ్డి నగర్ నుంచి జంప్ అయ్యాడు. స్థానికుల సమాచారం ప్రకారం పోలీసులు ఘటన స్థాలికి చేరుకొని దర్యప్తుచేపట్టారు. జుబేదాబీ అప్పుడప్పుడు ప్రేమరాజు దగ్గరకు వచ్చిపోతుండేదని స్థానికులు తెలిపారు. ఇక ప్రేమరాజు కోసం గాలింపు చేశారు. అయితే ప్రేమరాజు సెల్‌ఫోన్ కూడా వాడకపోవడంతో ఆచూకీ కనుక్కోడానికి రెండు నెలలుపైగా పట్టింది. మొత్తానికి నింధితుడ్ని చేధించి అరెస్ట్ చేశారు.