లైంగిక ఆనందం కోసం ఏకంగా భార్యాలను మార్చుకుంటున్న నలుగురు బద్మాష్ గాళ్లను ఎట్టకేలకు కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఓ మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి తిరువనంతపురం అలప్పుజ జిల్లాలోని కయంకుళం పట్టణంలో ఈ నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే కొత్త వారితో లైంగికంగా పాల్గోనలని తన భర్త తరుచూ వేధింపులు తాళలేక ఆ మహిళ ఏకంగా పోలీసులను ఆశ్రయించింది. అయితే గత కొంత కాలంగా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఈ తతంగం గుట్టురట్టు కావడంతో కేరళలో కలకలం రేగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గతేడాది మార్చిలో 'వైఫ్ స్వాపింగ్' (భార్యల మార్పిడి) ఇక్కడ ప్రారంభమైందని షేర్ చాట్ యాప్లో ఒకరిని ఒకరు పరిచయం చేసుకొని కాలికట్కు చెందిన అర్షద్ అనే వ్యక్తితో ఏకాంతంగా గడపాలని తన భర్త వేధించాడని పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా బాధితురాలి భర్తతో పాటు కిరణ్, సీది, ఉమేశ్, బ్లెసరిన్ అరెస్ట్ చేసి, ఐపీసీ 366 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్టు చెప్పారు.