దుబాయిలో ఓ యువతిపై అత్యాచారం కేసులో ఓ వ్యక్తికి దుబాయ్ కోర్టు జైలుశిక్ష విధించింది. ఇక వివరాల్లోకి వెళితే దుబాయిలోని అల్బదా ప్రాంతంలోని ఓ విల్లాలో గది అద్దెకు తిసుకొని నివసిస్తోంది ఓ మహిళ. అయితే తమ బంధువుల ఇంట్లో పార్టీ ఉంటే వెళ్లింది. అక్కడే వాళ్ల బంధువులతో మార్నింగ్ నాలుగు గంటల వరకు అక్కడే గడిపింది. పార్టీ ముగిసిన తరువాత ఆ మహిళ తన కారులో తమ ఇంటికి బయలుదేరి ఇంటికి వచ్చింది. కారు పార్కింగ్ చేసి తన గదికి వచ్చి పడుకుంది.
అయితే ఇదే సరైన సమయంగా భావించిన ఓ 23 ఏండ్ల కుర్రాడు తనకు తెలియకుండా రహస్యంగా తన రూంలోకి ప్రవేశించాడు. ఇక మెళ్లిగా నిద్రలోకి జారుకున్న ఆయువతిపై ఆ కుర్రాడు ఎవరైనా వస్తున్నారో గమనించి ఆ తరువాత ఆమెను బలవంతంగా అనుభవించడానికి ప్రయత్నించాడు ఆ యువకుడు. అయితే కాసేపటికి ఆ మహిళకు తనపైన ఎవరో ఉన్నట్లు అనిపించడంతో వెంటనే నిద్రలోంచి లేచి చూసేసరికి కళ్లముందు ఆ యువకుడు ఉన్నాడు. దీంతో ఒక్కసారిగా ఉల్కిపడింది ఆ మహిళ. దీంతో ఆమెపైనుంచి లేచిన అతను పలాయనం చిత్తగించాడు. అయితే ఆ యువకుడిని వెంబడించిన ఆమె తన భర్త రాగానే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా డీఎన్ఏ పరీక్షలు నిర్వహించిన పోలీసులు ఆ యువకుడు ఆమెను బలాత్కరించడానికి యత్నించాడని ధ్రువీకరించారు. గతేడాది జరిగిన ఈ ఘటనలో నిందితుడు తప్పుచేసినట్లు నిర్ధారించిన కోర్టు నిందితుడికి జైలుశిక్ష విధించింది.