తలనొప్పి అని డాక్టర్‌ దగ్గరకు వెళితే.. మహిళను చికటి గదిలోకి..

Update: 2019-05-04 09:17 GMT

మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలకు నివరించేందు ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కానీ ఫలితం లేకుండా పోతుంది. లోకంలో కామందుల చేతిలో స్త్రీ బలికాక తప్పడం లేదు. ఇదిలా ఉంటే వైద్యం కోసమని ఆసుపత్రికి వెళ్లినా ఓ మహిళకు అక్కడ కూడా లైంగిక వేధింపులు తప్పలేదు. వైద్యో నారాయణో హరి అంటారు. కానీ అలాంటి వైద్యుడే కామంతో కళ్లు ముసుపోయి ఆసుపత్రికి వచ్చిన ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడో కీచక వైద్యుడు. నొప్పి తగ్గాలంటే మసాజ్‌ చేయాలంటూ గదిలోకి తీసుకెళ్లి మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని చిలుకనగర్‌ బస్తీకి చెందిన ఓ మహిళకి బాగా తలనోప్పి రావడంతో స్థానికంగా ఉన్న బస్తీ దవాఖానాను సంప్రదించి.

తలనొప్పి, దగ్గు తరచూ వస్తుందని పరీక్షలు చేయమని వైద్యుడు బాలరాజును సంప్రదించారు. అయితే ఈ తల నొప్పి తగ్గలంటే మసాజ్‌ చేయాలంటూ ఆస్పత్రిలోని ఓ చికటి గదిలోకి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు ఆ వైద్యుడు. దీంతో మహిళ ఉప్పల్‌ పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని బాలరాజును అదుపులోకి తీసు​కొని విచారిస్తున్నారు.

Similar News