శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు

Update: 2019-06-06 01:38 GMT
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
  • whatsapp icon

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. స్వామి వారిని దర్శించుకునే భక్తులతో కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయాయి. దీంతో భక్తులు కంపార్ట్‌మెంట్ల వెలుపల వరకు క్యూ కట్టారు. శ్రీనివాసుడి సాధారణ సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిర్దేశిత టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతుంది. స్వామివారిని నిన్న 70,586 మంది భక్తులు దర్శించుకున్నారు. 36,599 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ. 2.89 కోట్లుగా ఉంది.భక్తుల రద్దీ కారణంగా అన్ని రకాల క్యూలైన్లు, ప్రసాదం కౌంటర్లతో పాటు ఆలయ ప్రాంగణమంతా కిటకిటలాడుతోంది. 

Tags:    

Similar News