అనంతపురం జిల్లా శాంతిపురానికి చెందిన నాగరాజుపై కుట్రచేసి హత్యయత్నం చేసిన కేసులో రామకుప్పం మండలం పెద్దూరు క్రాస్ లో అతడి భార్యతో పాటు మరో ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఎస్ఐ మునస్వామి తెలిపిన వివరాల ప్రకారం అనంతపురం జిల్లాకు చెందిన నాగరాజుకు, పల్లికుప్పానికి చెందిన సౌమ్యతో గత నాలుగేళ్ల క్రితం పెళ్లిఅయింది. కాగా శాంతిపురంలోని గ్రోమోర్ సంస్థలో నాగరాజు అకౌంటెంట్‌గా పనిచేస్తుండేవాడు. ఈ క్రమంలోనే సౌమ్యకు శాంతిపురం మండలం బెండనకుప్పానికి చెందిన జనార్దన్‌తో ఏర్పడ్డ పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారి చివరికి వివహేతర సంబంధానికి దారితీసింది. అయితే తమ సంబంధానికి అడ్డుగా ఉన్న నాగరాజును ఎలాగైన మట్టుపెట్టాలని ప్రియుడు జనార్దన్‌తో కలిసి సౌమ్య పన్నగం పన్నింది.
గత మంగళవారం పల్లికుప్పంలోని పుట్టింటికి వెళుతున్నానని, రాత్రికి అక్కడకు రావాలని నాగరాజుకు చెప్పింది సౌమ్య. దీంతో నాగరాజు పల్లికుప్పంకి బయలుదేరాడు అయితే సౌమ్య కుట్రపన్నినట్టుగానే గంగవరానికి చెందిన బాబు (20), భానుప్రకాశ్ (19), రాజేష్ (24), పుంగనూరుకు చెందిన అశోక్ (20), కర్ణాటక రాష్ట్రం నంగిలి గ్రామాని కి చెందిన సోమశేఖర్ (25)తో కలిసి నాగరాజుకోసం కాపుకాసింది. దారిలో వస్తున్న నాగరాజుపై కత్తులతో దాడి చేయించాడు. కాగా దారిలో ద్వి చక్ర వాహనదారులు అక్కడి నుండి హుడాయించారు. దీంతో నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నాగరాజు ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఘటన స్థలం దొరికిన సెల్‌ఫోన్ ఆధారంగా నాగరాజు భార్య సౌమ్య తన ప్రియుడు జనార్దన్‌తో కలిసి నాగరాజును చంపివేయడానికి కుట్ర చేసినట్లు నిర్ధారణ అయింది.బుధవారం మధ్యాహ్నం శాంతిపు రం సమీపంలో నిందితులను అరెస్ట్ చేశారు.