సూత్రధారి యాక్టింగ్ స్కూల్ యజమాని వినయ్ వర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. నటన నేర్చుకోవాలంటే నగ్ననంగా ఉండాలని షరతులు విధించి 9 మంది యువతులతో అసభ్యంగా ప్రవర్తించాడు వినయ్ వర్మ. దీంతో ఓ యువతి ఫిర్యాదుతో హైదరాబాద్ నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సెక్షన్ 354 A నిర్భయ యాక్ట్, 506, 509 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. విచారణ నిమిత్తం నిందితుడ్ని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. తన కోచింగ్ సెంటర్కు యాక్టింగ్ నేర్చుకుందామని వచ్చిన యువతుల దగ్గర్నుంచి దాదాపు రూ.25,000 ఫీజు వసూలు చేసే వినయ్ వర్మ, ట్రైనింగ్ పేరుతో యువతులపై లైంగికదాడికి పాల్పడుతున్నాడు. బట్టలు విప్పితేనే కోచింగ్ ఇస్తానని చెప్పి, తనను ఓ గదిలో బంధించి వేధించాడంటూ ఓ యువతి హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే.