హాజీపూర్ బావిలో మృతదేహాల కలకలంపై భువనగిరి ఏసీపీ భుజంగరావు hmtvతో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడారు. శ్రావణి మృతదేహం తీస్తుండగా బావిలో బ్యాగ్ కనిపించిందని, ఆ బ్యాగ్‌ను పైకి తీస్తుంటే ఎముకలు బయటికి వచ్చాయని తెలిపారు. ఆ బ్యాగ్‌లో బ్యాగ్‌లో హ్యాండ్ పర్స్, ఐడీ కార్డ్స్ ఉన్నాయన్న భువనగిరి ఏసీపీ భుజంగరావు కాలేజీ ఐడీ, ఆధార్ కార్డు ప్రకారం మనీషాగా గుర్తించినట్లు తెలిపారు. అయితే మనీషా మిస్సింగ్‌పై పోలీస్ రికార్డ్స్‌లో కంప్లైంట్ లేకపోవడంతో హాజీపూర్ గ్రామస్తులను విచారించామని, కానీ మనీషా అదృశ్యం కాలేదని చెప్పారని అన్నారు.
తమకు దొరికిన సమాచారం మేరకు మనీషా తండ్రిని సంప్రదించగా, గతంలో రెండుమూడుసార్లు ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి వచ్చిందని, ఇప్పుడు కూడా అలాగే వస్తుందని అనుకున్నామని, అందుకే కంప్లైంట్ ఇవ్వలేదని చెప్పారని ఏసీపీ వెల్లడించారు. మనీషా కేఎల్‌ఆర్ కాలేజీలో డిగ్రీ చదువుతోందన్న భువనగిరి ఏసీపీ భుజంగరావు శ్రావణి కేసులో ఇంకా ఎవర్నీ అరెస్ట్ చేయలేదని చెప్పుకొచ్చారు.