Vladimir Putin: ఉక్రెయిన్ యుద్ధంపై పుతిన్ సంచలన వ్యాఖ్యలు.. అణుబాంబు వేసే సమయం వచ్చింది...
Vladimir Putin: అణుబాంబు వేసే సమయం వచ్చిందంటూ వ్యాఖ్యలు
Vladimir Putin: ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు చుక్కలు కనిపిస్తున్నాయి. అడగడుగునా ఎదురుదెబ్బలు తగులుతుండటంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రిజర్వ్ సైనిక దళాల్ని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఉక్రెయిన్‌పై ఫిబ్రవరిలో అటాక్ మొదలుపెట్టిన రష్యాను ఉక్రెయిన్ అడగడుగునా తిప్పికొడుతుంది. దీంతో రష్యా రిజర్వ్ సైనికుల్ని కూడా రంగంలోకి దింపనున్నది. దీనికి సంబంధించిన ఆదేశాలను కూడా జారీ చేసినట్లు జాతిని ఉద్దేశించిన చేసిన ప్రసంగంలో పుతిన్ వెల్లడించారు. దీంతో సుమారు 3 లక్షల మంది రిజర్వ్ లేదా మాజీ సైనికులు దళంలో చేరే అవకాశాలు ఉన్నాయి.
పశ్చిమ దేశాలు తమను బ్లాక్‌మెయిల్ చేస్తున్నాయని పుతిన్ ఆరోపించారు. తమ ప్రాంతీయ సమగ్రతకు ఎటువంటి ప్రమాదం జరిగినా రష్యాను, తమ ప్రజలను కాపాడుకునేందుకు, తమ వద్ద ఉన్న అన్ని రకాల వ్యవస్థలను వాడుకుంటామని పుతిన్ హెచ్చరించారు. అణ్వాయుధాలను చూపిస్తూ బ్లాక్‌మెయిల్ చేయాలనుకునేవాళ్లు ఒకటి గుర్తుంచుకోవాలని, ఆ పరిస్థితులు తిరగబడే అవకాశం ఉన్నట్లు ఆయన అన్నారు.