అమెరికాలో ట్రంప్ రెండోసారి అభిశంసన తీర్మానం నుంచి గట్టెక్కారు. ఐదు రోజుల సుదీర్ఘ చర్చ అనంతరం సెనేట్ ఆయనపై అభిశంసన తీర్మానాన్ని తోసిపుచ్చింది. ట్రంప్‌పై వచ్చిన అభియోగాల నుంచి విముక్తిని ప్రసాదించింది. ట్రంప్ అభిశంసన తీర్మానంపై ఓటింగ్ జరుగగా, బలమైన రిపబ్లికన్లు విజయం సాధించారు. ఈ తీర్మానం ప్రతినిధుల సభలో ఆమోదం పొందగా, సెనేట్ లో మాత్రం 57-43 తేడాతో వీగిపోయింది. ఏడుగురు రిపబ్లికన్లు ట్రంప్ కు వ్యతిరేకంగా ఓటు వేసినప్పటికీ, ట్రంప్ పై కఠిన చర్యలు తీసుకునేందుకు ఉద్దేశించిన బిల్లు ఆమోదం పొందలేకపోయింది.