Tahawwaur Rana: నేడు భారత్ కు తహవ్వుర్ రాణా.. ప్రత్యేక విమానంలో తరలింపు

Tahawwaur Rana: అమెరికాలో నిర్భంధంలో ఉన్న ముంబై ఉగ్రదాడి కేసు నిందితుడు తహవ్వుర్ హుస్సేన్ రాణాను భారత్ కు ప్రత్యేక విమానంలో తీసుకువస్తున్నారు. గురువారమే ఆతను భారత్ కు చేరుకుంటాడని అభిజ్న వర్గాలు తెలిపాయి. రాణా అప్పగింతకు న్యాయ సంబంధమైన అవరోధాలన్నీ తొలగిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
26/11 దాడిగా ప్రసిద్ధమైన ముంబై ఉగ్రదాడికి రాణా సూత్రధారిగా వ్యవహరించాడు. 2008లో నవంబర్ 26న జరిగిన ఈ దాడిలో 10 మంది టెర్రరిస్టులు ముంబైలోని పలు ప్రాంతాల్లో విచక్షణా రహితంగా కాల్పులు జరిపి 166 మంది అమాయాకులను పొట్టబెట్టుకున్నారు. అమెరికా తనను భారత్ కు అప్పగించకుండా నిరోధించేందుకు అందుబాటులో ఉన్న అన్ని న్యాయ వర్గాలను రాణా ఉపయోగించుకున్నాడు.
చివరిగా తన అప్పగింతను నిరోధించాల్సిందిగా కోరుతూ సమర్పించిన దరఖాస్తును అమెరికా సుప్రీంకోర్టు ఈమధ్యే తిరస్కరించింది. ముంబై దాడులు జరిగిన ఏడాది అనంతరం 2009 అక్టోబరులో రాణా అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్ బిఐ చేతికి చిక్కి లాస్ ఏంజెల్స్ లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్ లో నిర్బంధంలో ఉన్నాడు.
26/11 దాడికి సూత్రధారి అయిన పాకిస్థానీ అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ కోల్ మన్ హెడ్లీకి రాణా సన్నిహితుడని తెలుస్తోంది. తహవ్వుర్ రాణాను అమెరికా మన దేశానికి అప్పగిస్తోందన్న వార్తల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజీద్ దోభాల్, ఇతర ఉన్నతాధికారులతో ఈ పరిణామంపై సమీక్షించారు.