పాకిస్తాన్ మాజీ ప్రధాని, రైల్వే మంత్రికి కరోనావైరస్

పాకిస్తాన్ మాజీ ప్రధాని షాహిద్ ఖాకాన్ అబ్బాసి, ప్రస్తుత రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ లకు సోమవారం కరోనావైరస్ పరీక్షలు చేశారు.

Update: 2020-06-08 14:04 GMT

పాకిస్తాన్ మాజీ ప్రధాని షాహిద్ ఖాకాన్ అబ్బాసి, ప్రస్తుత రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ లకు సోమవారం కరోనావైరస్ పరీక్షలు చేశారు. దీంతో ఇద్దరికి కరోనా సోకింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పిఎంఎల్-ఎన్) ప్రతినిధి ఒకరు ధృవీకరించారు.. 61 ఏళ్ల షాహిద్ అబ్బాసికి వైరస్ సోకినట్లు ఆయన స్పష్టం చేశారు.

అవినీతి కేసులో ప్రధాని పదవిని కోల్పోయారు నవాజ్ షరీఫ్.. ‌ ఆ తరువాత పిఎంఎల్-ఎన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న అబ్బాసి ప్రధాని పీఠం అధిరోహించారు.. 2017 ఆగస్టు నుండి 2018 మే వరకు ప్రధానిగా పనిచేశారు. సోమవారం ఆయనకు COVID-19 పాజిటివ్ అని తేలిన తరువాత ఇంట్లో స్వీయ-నిర్బంధంలో పార్టీ నేతలు తెలిపారు. మరోవైపు రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ కు కూడా కరోనావైరస్ సోకిందని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.


Tags:    

Similar News