Canada: మూసివేసిన పాఠశాలల్లో పిల్లల అస్థిపంజరాలు
Canada: కెనడాలోని అనేక మూసి ఉన్న పాఠశాలల్లో వందలాది చిన్నారుల అస్థిపంజరాలు బయటపడుతూ ప్రజల్ని, ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తోంది.
Canada: కెనడాలోని అనేక మూసి ఉన్న పాఠశాలల్లో వందలాది చిన్నారుల అస్థిపంజరాలు బయటపడుతూ ప్రజల్ని, ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. గత నెలలో బ్రిటిష్ కొలంబియాలోని ఓ మూసి ఉన్న పాఠశాల ప్రాంగణంలో 200 అస్థి పంజరాలు బయటపడ్డాయి. తాజాగా వాంకోవర్‌లో మరో రెసిడెన్షియల్ స్కూల్ ప్రాంగణంలో 600కు పైగా అస్థిపంజరాలను అధికారులు గుర్తించారు.
రాడార్ ద్వారా లభ్యమైన సమాచారంతో ఈ దారుణాలు వెలుగు చూశాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు దేశ వ్యాప్తంగా మూసి ఉన్న రెసిడెన్సియల్ స్కూళ్ళపై దృష్టి సారించారు. 1970 వరకు రోమన్ కాథలిక్ చర్చి ఆధ్వర్యంలో నడిచిన రెసిడెన్సియల్ స్కూళ్ళలోనే ఈ దారుణాలు జరిగినట్లు తెలుస్తోంది. 1970 తర్వాత కెనడాలో అనేక మిషనరీ స్కూళ్ళు మూతపడ్డాయి.