ట్రంప్ శ్వేతసౌధం ఖాళీచేయాల్సిందేనా?
ట్రంప్ శ్వేతసౌధం ఖాళీచేయక తప్పేటట్టు లేదు. బట్టలు సర్దేసుకొని బయటకు రావాల్సిందే అని ఎన్నికల ఫలితాలు డిసైడ్ చేస్తున్నాయి. అవసరమైన 270 మార్జిన్ ఓట్లకు డెమొక్రటిక్ పార్టీ అతిచేరువలో ఉంది.
ట్రంప్ శ్వేతసౌధం ఖాళీచేయక తప్పేటట్టు లేదు. బట్టలు సర్దేసుకొని బయటకు రావాల్సిందే అని ఎన్నికల ఫలితాలు డిసైడ్ చేస్తున్నాయి. అవసరమైన 270 మార్జిన్ ఓట్లకు డెమొక్రటిక్ పార్టీ అతిచేరువలో ఉంది. మరో 6సీట్లు గెలుచుకుంటే బైడెన్ అగ్రరాజ్యం పీఠంపై ఎక్కి కూర్చోవడం ఖాయం.
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేకేత్తిస్తున్నాయి. జో బైడెన్ 264 ఎలక్టోరల్ ఓట్లు, డొనాల్డ్ ట్రంప్ 214 ఓట్లు సాధించారు. ట్రంప్ 50కు పైగా ఓట్లతో వెనకంజలో ఉన్నారు. ఇంకా ఐదు రాష్ట్రాల ఫలితాలు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో చివరి వరకు ఏం జరుగుతుందో తెలియని అనిశ్చితి నెలకొంది.
విజయంపై పూర్తి స్పష్టత లేకపోయినప్పటికీ బైడెన్ ఓ రికార్డు సృష్టించాడు. అమెరికా చరిత్రలోనే అత్యధిక ఓట్లు సంపాదించిన అధ్యక్ష అభ్యర్థిగా బైడెన్ టాప్ రేసులోకి దూసుకెళ్లాడు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా నెలకొల్పిన రికార్డును బైడెన్ తిరగరాశారు. 2008 ఎన్నికల్లో ఒబామా 6కోట్ల 68లక్షల 62వేల 39 ఓట్లు సాధించగా.. ప్రస్తుతం బైడెన్ 72కోట్ల 48వేల 7వందల 70 ఓట్లను సాధించారు. ఇంకా కౌంటింగ్ జరుగుతుండడంతో ఓట్ల సంఖ్య పెరిగే అవకాశముంది.
సంచలన నిర్ణయాలతో అమెరికన్లను హడలెత్తించిన ట్రంప్‌కు ప్రజాధారణ తక్కువేం లేదు. ఇందుకు ఈ ఎన్నికల ఫలితాలే సాక్ష‌్యం. 2016లో వచ్చిన ఓట్ల కంటే ఈ ఎన్నికల్లో ఆయనకు 50 లక్షల ఓట్లు అధికంగా వచ్చాయి. ఈసారి ఎన్నికల్లో ట్రంప్‌కు ఏకంగా 6.8 కోట్ల మంది ఓటు వేశారు. ఇక్కడే ఆయన చరిష్మా ఎంటో అర్థం అవుతోంది.
కౌంటింగ్‌లో అవకతవకలు జరుగుతున్నాయని ట్రంప్ అనుకూల వర్గాలు కొత్త స్వరం అందుకున్నాయి. ఈ వాధనలను తిప్పికొట్టారు డెమొక్రటిక్ అభ్యర్థి బైడెన్. మనప్రజాస్వామ్యాన్ని ఎవరూ ఎప్పుడు దూరం చేయలేరని స్పష్టం చేశారు. చివరి ఓటింగ్ ఫలితం తేలేవరకు డెమొక్రటిక్ తన విజయాన్ని ప్రకటించదన్నారు.