Donald Trump: DST రద్దుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్.. అసలు డీఎస్టీ అంటే ఏంటి?

Donald Trump: డే లైట్ సేవింగ్ టైమ్ (DST)ని రద్దు చేస్తానని డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. డే లైట్ సేవింగ్ టైమ్ అనుసరించడంతో అమెరికన్లపై భారం పడుతుందని ఆయన అన్నారు.

Update: 2024-12-14 10:37 GMT

Donald Trump: DST రద్దుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్.. అసలు డీఎస్టీ అంటే ఏంటి?

Donald Trump: డే లైట్ సేవింగ్ టైమ్ (DST)ని రద్దు చేస్తానని డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. డే లైట్ సేవింగ్ టైమ్ అనుసరించడంతో అమెరికన్లపై భారం పడుతుందని ఆయన అన్నారు. డీఎస్ టీ ని రద్దు చేయాలని 2021లో న్యూ స్టాండర్డ్ టైమ్ అనే బిల్లును సెనేటర్ మార్కో రుబియో తెచ్చారు.ఆయన ప్రస్తుతం ట్రంప్ కార్యవర్గంలో స్టేట్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించనున్నారు.

డీఎస్ టీ రద్దు ఎందుకు?

డీఎస్ టీ తో ఆర్ధిక భారం పడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయని రుబియో చెబుతున్నారు. అందుకే దీన్ని రద్దు చేయాలని కోరుతున్నారు.రుబియో తెచ్చిన బిల్లుకు ఆమోదం రాలేదు. దీంతో జో బైడెన్ కూడా దీన్ని రద్దు చేసేందుకు ముందుకు రాలేదు. మొదటి ప్రపంచ యుద్దం నుంచి డే లైట్ సేవింగ్ టైమ్ ను అమెరికన్లు పాటిస్తున్నారు.

డీఎస్ టీ అంటే ఏంటి?

అమెరికా ప్రజలు పగలు వెలుతురు సమయాన్ని ఓ గంట పెంచుకుంటారు. దీన్ని డే లైట్ సేవింగ్ గా పిలుస్తారు. ప్రతి ఏడాది మార్చి రెండో ఆదివారం మొదలై నవంబర్ రెండో ఆదివారంతో డీఎస్ టీ ముగుస్తోంది. వేసవికాలం ప్రారంభమైన మార్చి రెండో ఆదివారం రోజు తెల్లవారుజామున రెండు గంటలకు తమ గడియారాలను ఓ గంట ముందుకు తిప్పుతారు. ఇలా చేస్తే డే లైట్ ఎక్కువగా ఉంటుందని చెబుతారు. నవంబర్ లో తమ గడియారాలను ఒక్క గంట వెనక్కు మార్చుకుంటారు. మార్చి నుంచి నవంబర్ వరకు డీఎస్టీతో అదనంగా సమయం రాదు. కానీ డే లైట ఎక్కువగా వినియోగించుకున్న సైకలాజికల్ ఫీలింగ్ వస్తుంది.

డీఎస్ టీకి వంద ఏళ్ల చరిత్ర

డే లైట్ సేవింగ్ టైమ్ కు వందల ఏళ్ల చరిత్ర ఉంది. 20వ శతాబ్దం ప్రారంభంలో దీన్ని తొలిసారిగా అమలు చేశారని చెబుతారు. ఏప్రిల్ లో 4 ఆదివారాల్లో 2 నిమిషాల చొప్పున ముందుకు, సెప్టెంబర్ లో 4 ఆదివారాల్లో 20 నిమిషాల చొప్పున గడియారాలను వెనక్కు తిప్పేవారు. ఈ పద్దతిపై తొలినాళ్లలో విమర్శలు వచ్చాయి. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత పరిస్థితి మారింది. రాత్రిపూట ఇళ్లలో చలి మంటలు వేసుకునేందుకు అవసరమైన బొగ్గును వీలైనంత తక్కువ వాడేందుకు డే లైట్ సేవింగ్ ను పరిచయం చేశారు. ఆ తర్వాత కొంతకాలానికి దీని పేరుతో చట్ట చేశారు. అమెరికాలోని అరిజోనా, హవాయి, ప్యూర్టోరికో వంటి ప్రాంతాల్లో డీఎస్టీని అనుసరించరు.

Tags:    

Similar News