దక్షిణ అమెరికాలోని చిలీలో కరోనావైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. అక్కడ గడిచిన 24 గంటల్లో ఇక్కడ 4207 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసుల సంఖ్య 1 లక్ష 22 వేల 499 కు చేరుకుంది. 24 గంటల్లో మరో 92 మంది మరణించారు. మృతుల సంఖ్య 1448 కు పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 1521 మంది రోగులను ఐసియులో ఉంచారు.
1291 మంది రోగులు వెంటిలేటర్ మీద ఉన్నారు. 337 మంది రోగుల పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు ఇక్కడ మరణాల రేట్ 2 శాతమే ఉంది. అలాగే రికవరీ రేటు కూడా భారీగానే ఉంది. ఇప్పటివరకూ 95,631 మంది కరోనా భారీ నుండి కోలుకున్నారు. రికవరీ రేటు ఇక్కడ 90 శాతం పైగానే ఉంది. ఈ లెక్కన చూసుకుంటే చీలి దేశంలోనే కరోనా నుంచి వేగంగా కోలుకుంటున్నారని చెప్పవచ్చు.