న్యూఇ‍యర్‌ క్షణాలు మొదట ప్రవేశించేది ఎక్కడో తెలుసా

Update: 2019-01-01 05:24 GMT

న్యూ ఇయర్‌ వేడుకలు అనగానే మనకు మొదట గుర్తొచ్చేది న్యూజిల్యాండ్. కానీ ఈ భూమ్మీద, న్యూఇయర్ సెలబ్రేషన్స్‌ మొదట మొదలయ్యేది మాత్రం సమోవా అనే దేశంలోనే. దాదాపు రెండు లక్షల జనాభా ఉన్న దేశం సమోవా. మనకంటే ఎనిమిదిన్నర గంటలు ముందుంటుంది. కొత్త ఏడాదికి చాలా సంప్రదాయబద్దంగా స్వాగతం పలుకుతారు. తమదైన ఆచార సాంప్రదాయాలు, నృత్యాలతో పండగలా జరుపుకుంటారు. ఇప్పటికే అక్కడ సంబరాలు అంబరాన్ని తాకాయి. వాస్తవానికి సమోవా తర్వాత గంటకు గానీ, న్యూజిల్యాండ్‌లో కొత్తేడాది పొద్దు పొడవదు. కానీ ప్రపంచమంతా న్యూఇయర్‌ హంగామా మొదలయ్యేది న్యూజిల్యాండ్‌గా ప్రసిద్ది అయ్యింది.

ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం మనకంటే ఐదున్నర గంటలు ముందుంటుంది. సిడ్నీలోని హార్వర్డ్ బ్రిడ్జ్ దగ్గర, న్యూఇయర్ వేడుకల సందడికి అంబరమే హద్దు.

సిడ్నీ న్యూఇయర్‌ వేడుకలకు ఖర్చయ్యేది ఎంతో తెలుసా...రూ.50కోట్లు ఖర్చు. బాణాసంచా, ఫైర్‌ వర్క్స్‌‌కు ప్రపంచమే ఫిదా. సిడ్నీ న్యూఇయర్‌ సెలబ్రేషన్స్‌ చూడ్డానికే, ప్రపంచ దేశాల నుంచి జనం తరలివస్తుంటారు. మనకంటే మూడున్నర గంటల ముందే జపాన్‌కు కొత్తేడాది. ఇంచుమించు ఇదే టైంకి సౌత్‌ కొరియాలో న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్.

భారత కాలమానం ప్రకారం జనవరి 1వ తేదీ తెల్లవారుజామున నాలుగున్నరకు అత్యధికంగా 43దేశాలకు కొత్తేడాది. అంటే ఆయా దేశాల్లో టైం అర్థరాత్రి 12 అన్నమాట. మనం న్యూఇయర్‌కు స్వాగతం చెప్పిన ఐదున్నర గంటల తర్వాత, ఇంగ్లండ్‌లో కొత్త సంవత్సరపు వేడుకలు. లండన్‌లోని బిగ్‌బెన్ గడియార స్తంభం దగ్గర వేడుకలు బ్రహ్మాండం. మనతో పోల్చుకుంటే అమెరికాలో, కొత్తేడాదికి పదిన్నర గంటలు తేడా. న్యూఇయర్‌ సెలబ్రేషన్స్‌కు అడ్డా, న్యూయార్క్‌లోని టైంస్క్వేర్‌. అక్కడ వరల్డ్‌డ్రాపింగ్ ఈవెంట్ అద్బుతం. సెకండ్స్ కౌంట్‌డౌన్, బాణాసంచా మెరిమిట్లు, ప్రజల ఆనందపు కేకలకు ఆకాశమే హద్దు. 

Similar News