సేంద్రియ ఎరువుల తయారీలో ఆద్భుతాలు సృష్టిస్తున్న యువ శాస్త్రవేత్త

Update: 2019-06-28 12:08 GMT

వేల రుపాయల ఖర్చులేదు వ్యర్థ పదార్థాలే ముడిపదార్థాలు వాటినే పంటలకు ఎరువుగా అందించాడు ఆద్బుతాలు సాధిస్తున్నాడు యువ శాస్త్రవేత్త. అర్గానిక్ ఎరువులకు పెటెంట్‌లను సొంతం చేసుకున్నాడు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన శాస్త్రవేత్త అమృత్ రెడ్డి. అర్గానిక్ ఎరువులు తయారు చేస్తూ అద్బుతాలు స్రుష్టిస్తున్నా ఈ యువ శాస్త్రవేత్త పై స్పెషల్ ఫోకస్‌.

రైతులకు రసాయనిక ఎరువులు భారంగా మారుతున్నాయి వేల రుపాయల పెట్టుబడి పెట్టిన తర్వాత పంటల దిగబడి రాక రైతులు అప్పుల పాలవుతున్నారు. రైతులను పెట్టుబడి వ్యయం నుండి విముక్తి కల్పించాలని భావించి పరిశోధనలు చేపట్టారు ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం దీపాయిగూడ గ్రామాని చెందిన యువ శాస్త్రవేత్త అమృత్ రెడ్డి.

వృత్తి రీత్యా మహరాష్ట్రలోని అమరావతి జిల్లాలో రసాయన అసిస్టేంట్ ప్రోపెషర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఒకవైపు విద్యార్థులకు పాఠాలు భోధిస్తూనే మరోవైపు రైతుల కోసం కొత్త కొత్త సేంద్రీయ ఎరువులను సృష్టించారు. అర్గానిక్ ఫర్టిలైజర్ , అర్గానిక్ పెస్టిసైడ్స్ , అర్గానిక్ ప్లవర్ స్టిములంట్ , అర్గానిక్ అమైమో యాసిడ్స్ , అర్గానిక్ వీడ్ సైడ్, మరియు అర్గానిక్ మైక్రో న్యూట్రిన్స్ విభాగాలలో సేంద్రీయ ఎరువులు కనుగొన్నారు అమృత్‌ రెడ్డి. వీటికి పెటేంట్ హక్కులను సైతం సాధించారు.

అమృత్ రెడ్డి రూపొందించిన సేంద్రీయ ఎరువులను నాగాపూర్ లోని సంస్థ గుర్తించి ఈ ఎరువుల వల్ల రైతులకు ప్రయోజనాలు ఉన్నాయని పేర్కోన్నది. ఆ సంస్థ నిర్వహించిన పరీక్షలలో ఈ శాస్త్రవేత్త రూపోందించిన ఎరువులలో పాస్పరస్, పోటాషియం, కాల్షియం, బోరాన్ , నైట్రోజన్ వంటి మూలకాలు రసాయన ఎరువులకన్నా అధికంగా ఉండటం విశేషం.

అమృత్ రెడ్డి ఎరువులు రూపోందించడానికి మాత్రం వెంట్రుకలు, చికెన్ లో చేత్త, ఎగ్స్ పోలుసులు వంటి వ్యర్థ పదార్థాలతో తయారు చేస్తున్నారు. రైతులకు ఎరువులను అందించడం మరోవైపు పర్యావరణం రక్షించాలనే ఉద్దేశ్యంతో ఇలా తయారు చేస్తున్నాని ఆయన అంటున్నారు. ఇలాంటి అద్బుతమైన పరిశోధనలకు ఇండియా బుక్ అప్ రికార్డు లో అమృత్ రెడ్డి రూపోందించిన పరిశోధనలకు స్థానం కూడా లభించింది

అమ్రుత్ రెడ్డి రూపోందించిన సేంద్రీయ ఎరువులను పత్తి, జోన్న , గోధుమ, కంది, సోయా పంటలకు వినియోగించారు. రసాయనిక ఎరువులు వినియోగిస్తే వచ్చే దిగుబడి కన్నా అధిక దిగుబడులు వచ్చాయి. పైగా రోగాలు తట్టుకోనే లక్షణాలు ఉంటున్నాయి. దీపాయిగూడలో రసాయనిక ఎరువులతో పత్తి పన్నెండు క్వింటాళ్ల దిగుబడి వస్తే అదే సేంద్రీయ ఎరువులతో ఉపయోగించిన పత్తి పద్దెనిమిది క్వింటాళ్ల దిగుబడి వచ్చిందని అమ్రుత్ రెడ్డి అంటున్నారు. భూములు సారవంతమై రైతులకు సిరులు‌ ‌ కురిపిస్తున్నాయని అంటున్నారు. వ్యర్థ పదర్ధాలతో తయారైన ఈ సేంద్రియ ఎరువులు దిగుబడిని పెంచడంలో మాత్రమే కాదు నేలలో సారాన్ని పెంచుతుందంటున్నారు అమృత్ రెడ్డి. ఈ సేంద్రియ ఎరువుల వినియోగం వల్ల ప్రతీ పంటలో సానుకూల ఫలితాలు రైతులు సాధించగలుగుతారంటున్నారు.

Full View 

Tags:    

Similar News