మార్చి 1 నుంచి మే 31 వరకు రైతులు చెల్లించే రుణాలపై వడ్డీ ఉండదు

Update: 2020-05-15 08:43 GMT

కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ వ్యవసాయానికి ఊతంగా ఉంటుందని నిర్మలా సీతారామన్ చెప్పారు. చిన్న, సన్నకారు రైతులకు లాభం చేకూర్చే విధంగా ఆర్థిక ప్యాకేజీ ఉందని ఆర్థిక మంత్రి తెలిపారు. రైతుల కోసం కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టారు. కేంద్రం ప్రవేశ పెట్టిన కిసాన్ క్రెడిట్ కార్డు రైతులకు బాగా ఉపయోగపడిందన్నారు కేంద్ర మంత్రి.

కేంద్రం ప్రవేశ పెట్టిన ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ లో భాగంగా రెండో రోజు రైతులకు ఊతమిచ్చే పథకాలను ప్రవేశపెట్టారు. చిన్న, సన్నకారు రైతులకు లాభం చేకూర్చే విధంగా ఆర్థిక ప్యాకేజీ ఉందని కేంద్రం ప్రకటించింది. సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు మే 31 వరకు వడ్డీ రాయితీ పొడిగిస్తామన్నారు. సన్నకారు రైతులకు తక్కువ వడ్డీ రేటుకే రుణాలు అందిచనున్నారు..

25లక్షల కిసాన్ క్రెడిట్ కార్డు హోల్డర్లకు రూ. 25వేల కోట్ల లోన్లు ఇచ్చామన్నారు. దేశంలో 3కోట్ల మంది రైతులకు రూ. 4.22 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేశామని వెల్లడించారు. ఈ రుణాలపై మూడు నెలల మారటోరియం కల్పిస్తున్నామన్నారు. రైతులకు 25లక్షల కిసాన్ క్రెడిట్ కార్డులు అందజేశాం అన్నారు. గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులకు మార్చిలో రూ. 29,500 కోట్లు ప్రభుత్వం రీఫైనాన్స్ చేసిందని మంత్రి వెల్లడించారు.

గ్రామీణ మౌలిక వసతుల కోసం మరో 4,200 కోట్లు విడుదల చేశామన్నారు కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్. మార్చి- ఏప్రిల్ లో 86,500 కోట్ల రుణాలు విడుదల చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల కోసం రాష్ట్రాలకు 6వేల 700 కోట్లు ఇచ్చామని మార్చిలో గ్రామీణ మౌలిక వసతుల కోసం 4వేల 200కోట్లు ఇచ్చామని తెలిపారు. నాబార్డు ద్వారా 29వేల 500 కోట్లు రూరల్ బ్యాంకులు తీసుకున్నాయని చెప్పారు.

అడవుల పరిరక్షణ, మొక్కలు నాటేందుకు కొత్త పథకం తెస్తున్నారు. రూ. 6వేల కోట్లతో గిరిజనులకు ఉపాధి కల్పించే క్యాంపా తీసుకొస్తున్నామన్నారు. వచ్చే నెల రోజుల్లో క్యాంపా పథకం ప్రారంభమవుతుందన్నారు కేంద్రం మంత్రి వెల్లడించారు. మొత్తానికి కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలో చిన్న, సన్నకారు రైతులకు ఊతం చేకూరేలా ఉన్నాయి. గ్రామీణ బ్యాంకులు, సహకర బ్యాంకుల ద్వారా రైతులకు సాయం అందేలా ఉంటుందని కేంద్ర మంత్రి తెలిపారు. ఇంతటితో వ్యవసాయరంగానికి సాయం ముగిసినట్టు కాదని నిర్మల సీతారామన్ వివరించారు.

Tags:    

Similar News