ఆది నుండి మనది గ్రామీణ ప్రధాన దేశం కనుక ప్రకృతి సిద్ధంగా లభించే మొక్కల పై ఆధారపడుతూ ఇంటి పంటల సాగు అలవాటుగా మారింది. అందునా మన దేశంలో వేలల్లో ఔషధ మొక్కలు ఉన్నాయి. ఇంటి పంటలో పెంచుకునే ఔషధ మొక్కలను, సముచిత రీతిలో వినియోగించుకుంటే సాధారణ ఆరోగ్య సమస్యల్లో 90 శాతం మేరకు రాకుండా చూసుకోవచ్చు. ఈ కోవలోనే కరోనా సమయంలోనూ మిద్దె తోటల్లో ఆరోగ్యాన్ని పండించుకుంటున్నారు నగరంలోని అమీర్ పెట్ కి చెందిన తారకం గారు. పూల మొక్కలతో మొదలై ఔషధ నిలయంగా మారిన ఆయన మిద్దె తోటపై ప్రత్యేక కథనం.
నగరానికి చెందిన తారకం గారు.. గత కొన్ని సంవత్సరాలుగా మిద్దెతోట సాగు చేస్తున్నారు. "ఆరోగ్యమే మహాభాగ్యం" అన్నది మన నానుడి ప్రస్తుత కరోనా కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు చేయని ప్రయత్నాలు లేవు. ముఖ్యంగా ఇలాంటి సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు తమ మిద్దె తోటలో పెంచుకున్న ఔషధ మొక్కలు బాగా ఉపకరిస్తన్నాయని అంటున్నారు నిర్వహకుడు తారకం గారు. చిన్న పూల మొక్కలతో మొదలై ఔషధ మొక్కలకు నిలయంగా సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్న వీరి ఇంటిపంట విశేషాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం.
-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..